కృష్ణుడు రాజ్య పాలన బాధ్యతలను విరమించుకుని  అడవిలో చెట్టు కింద కూర్చుని ఉండగా బోయవాడు వేసిన బాణానికి అవతారం చాలిస్తాడు. కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ సమయంలో దేహం మొత్తం దహనం అయింది కానీ గుండె మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయిందంటారు. ఆ గుండెను తీసుకెళ్లి సముద్రంలో కలపగా అటుగా వచ్చిన వేటగాడు దాన్ని తీసుకుంటాడు. అప్పటికే నీలిరంగులో మారిపోయిన ఆ గుండెను తీసుకెల్లి ఓ దైవప్రసాదంగా భావించి ఓ గుహలో ఉంచి నిత్యం పూజచేస్తాడు. ఆ తర్వాత వేటగాళ్ల వారసుల నుంచి ఆ నీలిరంగు పదార్థాన్ని తీసుకున్న పూరీ రాజు... జగన్నాథ స్వామి విగ్రహంలో పెట్టిస్తాడట.  పన్నెండేళ్ల తర్వాత వచ్చే అధిక ఆషాడంలో విగ్రహాలు మార్చినప్పుడు శ్రీకృష్ణుడి గుండెను కూడా మారుస్తారని చెబుతారు. 


Also Read: ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..


ఆ గుండెను మారుస్తున్నప్పుడు ఇప్పటివరకూ ఎవరైనా చూశారా అంటే... లేదనే చెప్పాలి. ఎందుకంటే పన్నెండేళ్లకు ఓసారి జగన్నాథుడి విగ్రహం మార్చేసమయంలో పూరీ నగరం మొత్తం చీకటి మయంగా మారుతుందట. నగరంలో విద్యుత్ నిలిపేస్తారట. CRPF సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణానని చుట్టుముడతారు...ఆ సమయంలో ఆలయంలోకి ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కల్లకు గంతలు కట్టుకుంటాడు, చేతులకు తొడుగులు వేసుకుంటాడు. పాత విగ్రహం నుంచి ఆ బ్రహ్మపదార్థం ( శ్రీకృష్ణుడి గుండె) తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు. వేల సంవత్సరాలుగా ఓ విగ్రహం నుంచి మరో విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మపదార్థాన్ని ఇప్పటివరకూ ఎవ్వరూ చూడలేదు. ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాముకూడా ఫాలో అవుతున్నాం అంటారు కానీ అదేంటన్నది పూజారులు కూడా చెప్పలేరు. కొందరు పూజారులైతే.. ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది కుందేలులా దూకుతున్నట్టు అనిపిస్తుందని, చేతిలో కదులుతూ ఉండే అనుభూతి కలుగుగుతుందని చెబుతారు. 


శ్రీ కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ద్వారక నీటమునిగిందని చెబుతారు. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం తర్వాత 36 ఏళ్లకు కృష్ణుడు అవతారం చాలించగా... గాంధారి శాపంతో పాటూ సప్తరుషుల శాపం మేరకు ముసలం పుట్టి యాదవవంశం నాశనమైందని ఇంతకుముందు కథనాల్లో చెప్పుకున్నాం. 
 
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 


Also Read:  కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?