importance of chanting 'Gayatri Mantra': 


గాయత్రి మంత్రం
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్


ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని రుగ్వేదంలో ఉంది. గాయత్రి మంత్రాన్ని ఓ నిర్దిష్టమైన పద్దతిలో జపించినా, విన్నా తద్వారా వెలువడే ధ్వని తరంగాలు మనసుని,శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి. దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు చాలామంది ప్రయత్నించి నిజమే అని అంగీకరించారు కూడా. 


Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?


అనుకూల ఆలోచనలు పెంచే మంత్రం


గాయంత్రి మంత్రం జపించడం వల్ల మెదడులో ఒక రకమైన ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం స్థాయి పెరుగుతాయని పరిశోధనలో తేలింది. గాయత్రి మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరం ప్రకంపనలను కొనసాగుతున్న అనుభవం పొందుతారు. గాయత్రి మంత్రాన్ని లయబద్ధంగా జపించే వారి చుట్టూ   లక్ష శక్తి తరంగాలు ఉద్భవిస్తాయని...ఈ మంత్రోపాసన ఓ వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేసి శక్తి సామర్థ్యాలు నింపుతుందని చెబుతారు. నాలుక ఉచ్ఛారణ ద్వారా కంఠం, అంగుటి, కొండనాలుక, పెదవులు, దంతాలు ఇలా నోటిలో విభిన్న అంగాలను ప్రభావితం చేస్తూ అక్కడి నుంచి నవనాడుల ద్వారా శరీరం మొత్తం వ్యాపిస్తుంది. అలా శరీరంలో ఉన్న ఏడు చక్రాలపైనా ఈ ప్రభావం పడి ఆ చక్రాలు ఉత్తేజితమవుతాయి.


Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు


గాయత్రీ మంత్రం జపిస్తే శరీరంలో జాగృతం అయ్యే గ్రంధులివే


ఓం- శిరస్సు పైన సుమారు ఆరు అంగుళాలు
భూ:- కుడి కన్ను పైన 4 అంగుళాలు
భువః -మూడవ నేత్రం పైన 3 అంగుళాలు
స్వ: - ఎడమ కన్ను పైన 4 అంగుళాలు


24 గ్రంధులను జాగృతం చేసే 24 అక్షరాలు


అక్షరం - గ్రంధి పేరు - శక్తి  -శరీరంలోని కేంద్రం 


1. తత్ - తాపీని - సఫలత - ఆజ్ఞాచక్రం
2. స - సఫలత - పరాక్రమం - ఎడమకన్ను
3. వి - విశ్వ - పాలన - కుడికన్ను
4. తు: - తుష్టి - మంగళకరం - ఎడమ చెవి
5 వ - వరద - యోగం - కుడిచెవి
6. రే - రేవతి - ప్రేమ - నాసికా
7. ణి - సూక్ష్మ - ఘనం - పై పెదవి
8. యం - జ్ఞాన - తేజం - క్రింది పెదవి
9. భర్ - భర్త - రక్షణ - కంఠము
10 గో - గోమతి - బుద్ధి కంఠ కూపము
11. దే - దేవిక - దఘనము - ఎడమ ఛాతి
12. వ - వరాహి - నిష్ఠ - కుడిఛాతీ
13. స్య - సింహని - ధారణ - ఉదరము పైన చివరి
14. ధీ - ధ్యాన - ప్రాణ - కాలేయం
15. మ - మర్యా ద - సంయమం - ప్లీహ్యము
16. హి - మూలము - స్పుట -  నాభి
17. ది - మేధ - రూరదర్శిత - వెన్నుపూస చివరి భాగము
18. యో - యోగమాయ - జాగృతి - ఎడమ భుజము
19. యో - యోగిని - ఉత్పాదన - కుడి భుజము
20. నః - ధారిణీ - సరసత - కుడి మోచేయి
21. ప్ర - పభవ - ఆదర్శం - ఎడమ మోచేయి ఆగ్ర భాగం
22. చో - ఉష్మ - సాహసం - కుడి మణికట్టు
23. ద - దృశ్య - వివేకం - కుడి అర చేయి అగ్రభాగం
24. యాత్ - నిరంజన - సేవ - ఎడమ అరచేయి


గాయత్రీ మంత్రం జపిస్తే శరీరంలో ఉన్న  ఈ 24 గ్రంథుల్లో స్పందన ఉంటుంది. ఈ 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి అంతర్హితమై ఉంటుందని చెబుతారు. మనిషిని సక్రమ మార్గంలో నడిపించేందుకు, చేపట్టిన పనిపై దృష్టి కేంద్రీకరింపచేసేందుకు ఈ మంత్ర పఠనం సహకరిస్తుంది. 


Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే!


బ్రహ్మ ముహూర్తం ఉత్తమం
అత్యంత శక్తివంతమైన గాయత్రి మంత్రాన్ని తెల్లవారుజామున, ప్రత్యేకంగా 'బ్రహ్మ ముహూర్తం' సమయంలో జపించడం ఉత్తమం. ఈ సమయంలో గాయత్రీ మంత్రాన్ని జపించడం వలన మనసుకి ప్రశాంతత చేకూరుతుంది.  విద్యార్థులు నిత్యం ఈ మంత్రం పఠిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.


Also Read: సరదాగా శివుడి కళ్లు మూసిన పార్వతీ దేవి - ఆ క్షణం ఏం జరిగిందంటే!