ప్రదోష వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి రోజున చేసుకుంటారు. శివానుగ్రహం కోసం ప్రదోష వ్రతం పాటిస్తారు. అంటే ప్రతి నెలలో కృష్ణపక్షంలో ఒక సారి శుక్లపక్షంలో మరోసారి రెండు సార్లు వస్తుంది. ఈ వ్రతాన్ని నెలలో రెండు సార్లు ఆచరిస్తారు. ప్రదోషవ్రతం సోమవారం నాడు వస్తే దానిని సోమ ప్రదోషం అంటారు. మంగళవారం నాడు వస్తే దానిని భౌమ ప్రదోషం అని, శనివారం వస్తే శని ప్రదోషం అని అంటారు. ఈ ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి శనివారం రోజున వచ్చింది. కనుక ఇది శని ప్రదోషం. శని ప్రదోష వ్రతం నాడు శివ పూజ చేస్తారు. సూర్యాస్తమయ సమయాన్ని బట్టి ఈ వ్రత సమయం ఉంటుంది. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత పారాయణం చెయ్యడం ద్వారా వ్రతం ముగుస్తుంది. శని ప్రదోష వ్రతం, శివపూజ మూహూర్తం గురించి ఇక్కడ తెలుసుకుందాం.


ఫిబ్రవరి 17, శుక్రవారం రాత్రి 11.36 నిమిషాలకు కృష్ణపక్ష త్రయోదశి తిథి ముగిస్తుంది. ఫిబ్రవరి 18 శనివారం రాత్రి 08.02 గంటలకు శని ప్రదోష మూహుర్తాన్ని అనుసరించి వ్రతం ఫిబ్రవరి 18 న వ్రతం ఆచరించవచ్చు. శని ప్రదోషవ్రతం ప్రారంభించేందుకు ముహూర్తం ఫిబ్రవరి 18 శనివారం సాయంత్రం 06.03 నిమిషాలను 08.02 నిమిషాల వరకు. ఈ యోగంలో శని ప్రదోష వ్రతం జరుపుకోవచ్చు. ఫిబ్రవరి 18న జరుపుకునే మొదటి శని ప్రదోష వ్రతంగా చెప్పుకోవచ్చు. ఈ శని ప్రదోషవ్రతం సర్వార్థ సిద్ధి యోగంలో ఉంటుంది. సర్వార్థ సిద్ధియోగం ఫిబ్రవరి 18 శనివారం సాయంత్రం 5. 42 గంటల నుంచి ఫిబ్రవరి 19 ఆదివారం ఉదయం 6.56 వరకు ఉంటుంది.


శని ప్రదోషవ్రత ప్రాశస్త్యం


శని ప్రదోషవ్రతం సాధారణంగా సంతాన ప్రాప్తి కోసం ఆచరిస్తారు. ప్రదోష కాలపు  మూహూర్తంలో పరమశివుడిని పద్ధతిగా పూజిస్తారు. అయితే పగలంతా కూడా ఉపవాసం చెయ్యాలి. శని ప్రదోష వ్రతం చేసుకునే వారు శని ప్రదోష కథ తప్పక చదువుకోవాలి. ఈ ప్రదోష వ్రత సమయం దాదాపుగా గంటన్నర ఉంటుంది. శని త్రయోదశి రోజున ఈ శని ప్రదోష వ్రతం చేస్తారు. ఈ పూజలో 16 రకాల విధానాలు ఉంటాయి. ఇవన్నీ ఒక పద్ధతిలో ఉంటాయి.


ఈ పూజను శోడషోపచార పూజ అని అంటారు. ధ్యాన ముద్రలో కూర్చోవాలి. చెక్కపై తెల్లని వస్త్రాన్ని కప్పి దాని మీద శివ లింగాన్ని లేదా శివుడి ప్రతిమను ఉంచాలి. దీపం వెలిగించాలి. శివపాదాభిషేకం తర్వాత, శివాభిషేకం చెయ్యాలి. శివుడిపై కుడిచేతితో కొద్దిగా నీళ్లు పోసి తర్వాత కొద్దిగా ఆచమనం చెయ్యాలి. తర్వాత చెయ్యి కడుక్కోవాలి. నీళ్లు, పాలు, గంగాజలం, తేనే, పెరుగు, నెయ్యితో అభిషేకం చెయ్యవచ్చు. ఈ పూజకు ఉపయోగించే శివ ప్రతిమ లేదా శివలింగం లోహంతో చేసిందై ఉండాలి. అభిషేకం తర్వాత విగ్రహాన్ని గుడ్డతో తుడవాలి. తర్వాత దేడికి తెల్లని వస్త్రాలు చుట్టాలి. ఆ తర్వాత అక్షితలు సమర్పించాలి. చందనం లేదా ఏదైన సుగంథ లేపనం సమర్పించాలి. తర్వాత బిల్వ పత్రాలు, పుష్పాలు సమర్పించాలి. ధూపం వెలిగించాలి. దీపం వెలిగించాలి. ఇప్పుడు శని ప్రదోష కథ చదువుకోవాలి. పండ్లు, తాంబూలం, కొబ్బరికాయ, అరటి పండు వంటివి ఏవైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుని హారతి ఇవ్వటంతో పూజ పూర్తవుతుంది.


Also Read: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!