Maha Shivratri 2023 Panch Kedar Yatra: శివుడి శరీర భాగాలు పడిన ప్రదేశాలను పంచకేదార క్షేత్రాలు అని పిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులు, బంధువులను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానకి శివుడి దర్శనానికి వెళ్లారు. అయితే భోళాశంకరుడు మాత్రం పాండవులకు తన దర్శనభాగ్యం కల్పించడు. కాశీని వదిలి ఉత్తరదిశగా హిమాలయాలకు వెళ్లిపోతాడు. పట్టువదలని పాండవులు..శివుడి దర్శనార్థం వెళతారు. అలా తిరుగుతూ తిరుగుతూ నందిరూపంలో ఉన్నాడని గుర్తిస్తారు. అప్పుడు ఆ నందిని పట్టుకునేందుక భీముడు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి శరీర భాగాలు పడిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి. వీటినే శివ పురాణంలో పంచ కేదారాలుగా చెప్పారు.


1.కేదార్నాథ్
2.తుంగనాథ్
3.రుద్రనాథ్
4.మహేశ్వర్
5.కల్పనాథ్


కేదార్నాథ్
పంచకేదారాల్లో మొదటిది, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కేథార్నాథ్. పాండవులకు అందకుండా పోయి నందిగా మారిన శివుడి మూపురభాగం పడిన చోటు ఇది. ఇక్కడి లింగం 8 గజాల పొడవు, 4 గజాల ఎత్తు, 4 గజాల వెడల్పు ఉంటుంది. ఇక్కడి శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు స్వర్గలోకానికి మార్గం ఇక్కడే ప్రారంభించారని పురాణకథనం. 


Also Read: శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా!


తుంగనాథ్
పంచ కేదారాల్లో రెండో పుణ్యక్షేత్రం తుంగనాథ్. శివుడి రెండు చేతులు పడిన ప్రాంతాన్ని తుంగానాథ్ అని అంటారు. అందుకే శివుడి చేతుల అడుగు ఎత్తులో లింగరూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఆలయానికి కుడివైపు పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. ఈ పంచకేదార నమూనాలను అర్జునుడు నిర్మించారని స్థల పురాణం


రుద్రనాథ్
పంచ కేదారాల్లో మూడో క్షేత్రం రుద్రనాథ్. శివుని ముఖ భాగం వెలసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ శివలింగం నంది ముఖ రూపంలో ఉంటుంది. నిత్యం తెల్లవారు జాము స్వామికి వెండి తొడుగును తొలగిస్తారు. ఈ ఆలయానికి వెనుక వైతరిణీ నది ప్రవహిస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పూర్వీకులకు మోక్షం కలుగుతందని విశ్వాసం.


మహేశ్వర్
పంచ కేదారాల్లో నాల్గవది మహేశ్వర్ పుణ్యక్షేత్రం. విశ్వనాథుడి నాభి భాగం పడిన ప్రాంతమే  మహేశ్వర్. ఇది గుప్తకాశీకి 24 మైళ్ల దూరంలో ఉంది.  భీముడు నిర్మించిన ఈ ఆలయం దర్శించుకోవడం వల్ల కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.


కల్పనాథ్
పంచ కేదారాల్లో చివరిది కల్పనాథ్ పుణ్యక్షేత్రం. ఇక్కడ శివుడి ఝటాజూటం లింగ రూపంలో వెలిశాడిని స్థలపురాణం. దట్టమైన అడవుల మధ్య చిన్న గుహల్లో వెలిసిన ఈ స్వామిని ఝుటేశ్వర్ మహదేవ్ అని పిలుస్తారు.


Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!


బిల్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం


త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం


కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం


కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం


ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం


రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం


అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం


ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం


సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం


దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం


బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం


సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం


అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం


బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం