Shakti Peethas: భారతదేశంలో ఉన్న శక్తిపీఠాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లోనూ దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతుంటారు. ఆదిశక్తికి అంకితం చేసే పవిత్ర స్థలాలుగా శక్తిపీఠాలు పూజలు అందుకుంటున్నాయి. ఇండియాలోనే కాదు.. దేశ సరిహద్దులను దాటి కూడా అమ్మవారి ఆధ్యాత్మిక ప్రభావం విస్తరించింది.
భారతదేశంలోని సుప్రసిద్ధ శక్తి పీఠాలు ఆ మహాపరమేశ్వరుడి సతీమణి సతీదేవిని దహనం చేసిన తర్వాత ఆమె శరీర భాగాలు పడిపోయిన ప్రదేశాలను సూచిస్తున్నాయి. కానీ కేవలం మన దేశంలో మాత్రమే పడలేదు. ఇండియాను ఆనుకొని ఉన్న పొరుగు దేశాల్లో కూడా పడ్డాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ఆ శక్తిపీఠాలేవో తెలుసుకుందాం.
1. హింగ్లాజ్ శక్తి పీఠ్, పాకిస్థాన్
సతీదేవి బ్రహ్మరంధ్ర.. కరాచీకి ఈశాన్యంగా 125 కి.మీ దూరంలో పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని అయ్యరి తహసిల్ వద్ద పడిపోయింది. ఆమె సిందూరం (వెర్మిలియన్)తో కప్పిన చిన్న గుండ్రని రాయిలో పూజిస్తున్నారు. ఈ ఆలయం ఒక చిన్న సహజమైన గుహలో ఉంది.
2. సుగంధ శక్తి పీఠం, బంగ్లాదేశ్:
బంగ్లాదేశ్ జిల్లా బరిసాల్‌కు ఉత్తరాన 20 కిమీ దూరంలో ఉన్న షికర్‌పూర్, శక్తి లేదా దేవి సుగంధకు నిలయం. దీనిని ఏక్జాత అని కూడా పిలుస్తారు. ఇప్పుడు, సునంద లేదా దేవి తార రూపంలో పూజలు అందుకుంటోంది. సతీదేవి ముక్కు ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. ఈ ఆలయం వార్షిక శివరాత్రి లేదా శివ చతుర్దశి మేళా వేడుకలకు ప్రసిద్ధి చెందింది.
3. శివహర్కరే శక్తి పీఠ్, పాకిస్థాన్:
రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించిన ఆధ్య శక్తి అవతారానికి ఇది పూజ్య స్థలం. ఇది కరాచీకి సమీపంలో ఉన్న పర్కై రైల్వే స్టేషన్ పక్కన పాకిస్తాన్‌లో ఉంది. హిందూ పురాణంలో, సతీదేవి కళ్ళు ఇక్కడ పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. దేవత భైరవ్ లేదా మహిష-మర్ధిని, క్రోడిష్ గా పూజలందుకుంటుంది. ఇది శివుని ఆగ్రహ రూపాన్ని సూచిస్తుంది.
4. గుహ్యేశ్వరి శక్తి పీఠం, నేపాల్:
నేపాల్‌లోని ఖాట్మండులో, పశుపతినాథ్ మందిరం పక్కనే ఆధ్య శక్తి ఆలయం ఉంది. పశుపతినాథ్ ఆలయం గుహ్యేశ్వరికి తూర్పున 1 కి.మీ దూరంలో ఉంది. సతీదేవి మోకాళ్లు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. ఆమె ఇప్పుడు దేవి మహాశిరగా పూజిలందుకుంటోంది.
5. గండకీ చండీ శక్తి పీఠం, నేపాల్:
ఈ శక్తి పీఠం నేపాల్‌లోని ముక్తినాథ్‌లో గండకీ నది పక్కన ఉంది. ఇక్కడే సతీదేవి కుడి చెంప పడింది. ఆమె ఇప్పుడు దేవి గండకి-చండీగా పూజలందుకుంటోంది. ఈ పవిత్ర స్థలం ప్రాముఖ్యత విష్ణు పురాణంలో వివరించారు. ముక్తినాథ్ బౌద్ధులు, హిందువులు ఇద్దరికీ గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ముక్తిని లేదా విముక్తిని సాధించే సాధనంగా పరిగణిస్తారు.
6. దాక్షాయణి శక్తి పీఠం, టిబెట్ (చైనా సమీపంలో):
ఈ శక్తి పీఠం టిబెట్, చైనా సమీపంలోని మానసరోవర్, కైలాష్ పర్వతాలకు సమీపంలో ఉన్న రాతి స్లాబ్ ఉంది. ఇక్కడ సతిదేవి కుడి చేయిలో ఒక భాగం పడింది. ఆమె దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన దేవి దాక్షాయణిగా కొలుస్తున్నారు.
7. జయంతి శక్తి పీఠం, బంగ్లాదేశ్:
బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ జిల్లాలో కలజోర్, బౌర్‌భాగ్ గ్రామంలోని జైంతియా-పూర్ సమీపంలో సతీదేవి ఎడమ తొడ పడింది. ఆమె జయంతి శక్తిగా పూజలందుకుంటుంది. క్రమాదీశ్వరుడు వచ్చినప్పుడు వైరభ్‌గా కనిపిస్తుంది.
8. భవానీ శక్తి పీఠం, బంగ్లాదేశ్:
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లోని సీతాకుంద స్టేషన్‌కు సమీపంలో చంద్ర-నాథ్ కొండలపై ఉన్న ఈ శక్తి పీఠాన్ని సీతకుంద చంద్రనాథ్ అని పిలుస్తారు. ఇక్కడే సతిదేవి కుడి చేయి భాగం పడింది.
9. మహాలక్ష్మి శక్తి పీఠం, బంగ్లాదేశ్:
బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ పట్టణానికి ఈశాన్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జౌన్‌పూర్ గ్రామానికి చెందిన శ్రీ-శైల్‌పై సతీదేవి మెడ పడింది. ఆమె మహా-లక్ష్మీ దేవి రూపంలో ఉంటుంది.
10. యోగేశ్వరి శక్తి పీఠం, బంగ్లాదేశ్:
జెషోరేశ్వరి అని పిలువబడే ఈ శక్తి పీఠం సతీదేవి కాళిని గౌరవిస్తుంది. బంగ్లాదేశ్ కుగ్రామమైన ఈశ్వరీపూర్, జషోర్, ఖుల్నా జిల్లాలో ఉంది. ఈ శక్తి పీఠాన్ని కనుగొన్న తర్వాత, మహారాజు ప్రతాపాదిత్య ఇక్కడ కాళీకి పూజలు చేశారు. సతీదేవి చేతులు, కాళ్ళు ఈ ప్రదేశంలో పడిపోయాయని నమ్ముతుంటారు. ఆమెను ఇప్పుడు దేవి యోగేశ్వరి శక్తి అని పిలుస్తారు.
11. శ్రావణి శక్తి పీఠం, బంగ్లాదేశ్:
ఈ శక్తి పీఠం బంగ్లాదేశ్‌లోని కుమారి కుంట, చిట్టగాంగ్ జిల్లాలో ఉంది. ఇక్కడ సతీదేవి వెన్నెముక పడిందని నమ్ముతుంటారు. ఆమె ఇప్పుడు దేవి శ్రావణిగా పూజలు అందుకుంటోంది.
12. అపర్ణ శక్తి పీఠ్, బంగ్లాదేశ్:
ఈ శక్తి పీఠం బంగ్లాదేశ్‌లోని బగురా జిల్లాలోని షేర్పూర్‌లోని భవానీ-పూర్ గ్రామంలో ఉంది. సతీదేవి ఎడమ పాదము ఈ ప్రదేశంలో పడిందని నమ్ముతారు. ఇక్కడ, ఆమె దేవి అపర్ణగా భక్తులు ఆరాధిస్తున్నారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.