మ్మ వారికి అత్యంత ప్రీతికరమైనది మూలా నక్షత్రం. మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి మీద దేవి సరస్వతిగా దర్శనం ఇస్తుంది. సరస్వతి దేవి జ్ఞానాన్ని అందించే తల్లి. పురాణాలలో సరస్వతిని బ్రహ్మచైతన్య మూర్తిగా ప్రస్తుతించారు. తెల్లని   ఈ తల్లి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళీదాసు వంటి మహామహులు ఈ తల్లి అనుగ్రహంతో గొప్ప సాధకులుగా ఎన్నటికి వన్నెతరగని సాహిత్యాన్నిప్రపంచానికి అందించారు. విద్యార్థులు ఈ నవరాత్రి వేళలో తల్లిని కొలుచుకోవడం వల్ల విజయాలు సాధిస్తారని నమ్మకం. లలిత కళలకు పట్టపు రాణి సరస్వతి దేవి. తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంస వాహనంపై కొలువై ఉంటుంది. ఈ దవళవస్త్రం మానసిక పరిపక్వతతోపాటు సకల విద్యలకు నిదర్శనం.  వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానం- వీటి కి   అధిష్ఠాత్రి మహా సరస్వతీ దేవి. ''సర్వ విద్యా స్వరూపా యా సా ప దేవీ సరస్వతీ''. సంగీతం, సాహిత్యం, మేధస్సు, ప్రతిభ, స్మృతి, వ్యాఖ్యానం, బోధనాశక్తి, సందేహ నివారణ శక్తి - సరస్వతీ రూపాలే. పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణ శాస్త్రాదులను సమన్వయం చేయించే 'సమన్వయ శక్తి' ఈ భారతీ దేవి. వీణాపుస్తక ధారిణి. మల్లెలా, మంచులా, వెన్నెలలా, శుద్ధత్వానికి   ప్రతీకగా ధవళ కాంతులతో ప్రకాశించే తల్లి మహా సరస్వతి. తపస్వుల తపశ్శక్తి. సిద్ధి స్వరూపిణి. వాగ్దేవి, వాణీదేవి, శారదాదేవి, బ్రాహ్మీ. ఈ తల్లి దయవల్లే మాటలు, మేధస్సు సమకూరుతాయి. కనుక 'సరస్వతీ కటా క్షం' మనం యాచించాలి.


చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి రూపంలో అమ్మవారు శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీదుర్గమ్మను ఆరాధిస్తారు. అమ్మ చేతిలోని వీణ సంగీత విద్యలకు, పుస్తకం లౌకిక విద్యలు, అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆకశంలో అభిజిత్‌ నక్షత్రం పక్కన వీణామండలం అని ఒకటుంది. వీణామండలాన్ని లైరా అనే పేరుతో పిలుస్తారు. శబ్దతరంగాల మూల స్వరూపమంతా ఆ మండలముగా ఖగోళ శాస్త్రవేత్తల భావన. వీణామండలం దగ్గరే హంసమండలం కూడా ఉంటుంది. హంసవాహినియైన సరస్వతిని ఖగోళ శాస్త్రవేత్తలు ఆ విధంగానే దర్శించారు. అటు ఖగోళపరంగా ఇటు వైజ్ఞానికంగా అమ్మవారు జ్ఞానశక్తి స్వరూపిణి. అజ్ఞానం మనిషికి   జాడ్యాన్నిస్తే జ్ఞానము ఆత్మోద్ధరణకు సంకేతంగా మారుతుంది. మీదపడిన వస్తు పరిజ్ఞానం నుండి తనేమిటో  తనకు తెలిసే ఆత్మ పరిజ్ఞానం వరకు ఈ అమ్మ కృపతోనే సాధ్యమౌతుంది. అందుకే ఆ అమ్మను నిరంతరం ఉపాసించాల్సిందే. ఈ నవరాత్రుల్లో నమస్కరించాల్సిందే.. శ్రీ సరస్వతి దేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం.


తెల్లని పూలతో పూజిస్తారు. సరస్వతి స్తోత్ర పారాయణం చెయ్యడం శ్రేష్టం. పిల్లలకు పుస్తకదానం చేయడం ఈరోజు చేసే ఉత్తమ దానం. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసాలు కూడా చేస్తారు కొన్ని ప్రాంతాలలో. 


శ్లోకం


సరస్వతి నమ: స్తుభ్యం వరదే కామరూపిణి


విద్యరంభం కరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా


పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణని


నిత్యం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి


 


సరస్వతి స్తోత్రం


యా కుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రావృతా


యా వీణావర దండమండితకరా యా శ్వేతపద్మాసనా |


యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా


సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||


దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభైరక్షమాలాందధానా


హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |

భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాఽసమానా


సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ||

సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |


ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||
 సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |


 విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||


 సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |


శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||


నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |


విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||


 శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |


శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||


 ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |


మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ||


 మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |


వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ||


 వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |


గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||


 సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |


సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః ||


 యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |


 దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ||


 అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |


చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః ||


 అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |


అణిమాద్యష్ట సిద్ధాయై ఆనందాయై నమో నమః ||


 జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః |


నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ||


 పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |


పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ||


 మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |


 బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ||


 కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |


కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ||


 సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |


చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ||


 ఇత్థం సరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్ |


సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ ||