స + అష్ట + అంగ = సాష్టాంగ
అంటే 8 అంగాలతో నమస్కారం చేయడం. 
శ్లోకం
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా !
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే !!
బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ సాష్టాంగ నమస్కారం చేయాలి 


అష్టాంగాలు
1) ఉరసా -  తొడలు
2) శిరసా -  తల
3) దృష్ట్యా - కళ్ళు
4) మనసా - హృదయం
5)వచసా -నోరు
6) పద్భ్యాం - పాదములు
7) కరాభ్యాం - చేతులు
8) కర్ణాభ్యాం -చెవులు


మనిషి సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగాలతో చేసిన తప్పులు క్షమించమని అడగాలి. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక ఉండి చేయాలి. 


Also Read: మీరు తినే ఆహారంపైనా నవగ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసా
సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి
1) ఉరస్సుతో నమస్కారం చేసేటపుడు ఛాతి నేలకు తగలాలి.
2) శిరస్సుతో నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.
3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని తలుచుకోవాలి
4) మనస్సుతో నమస్కారం అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.
5) వచసా నమస్కారం అంటే ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. 
6) పద్భ్యాం నమస్కారం అంటే రెండు పాదాలు నేలకు తగలాలి
7) కరాభ్యాం నమస్కారం అంటే రెండు చేతులు నేలకు తగలాలి
8) జానుభ్యాం నమస్కారం అంటే రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


Also Read: అఖండ సినిమాలో బాలయ్య చెప్పిన చక్రాలు విన్నారు కదా-అవేంటో తెలుసా
స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు
స్త్రీలు కేవలం  పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతోంది. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే పొట్ట నేలకు తాకుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది.  పాలిచ్చి పోషించే వక్ష స్థలం కూడా నేలకు తాకుతాయి. ఇలా చేయడం వల్ల ఏదైనా జరగరానిది జరిగే అవకాశం ఉంది. మన శాస్త్రాల్లో స్త్రీకి గొప్ప విలువ ఉంటుంది. సృష్టికి ఆధారమైన, పోషణకు ఆధారమైన స్థలం నేలకి తాకకూడదు. అందుకే మరీ అంతలా అనుకుంటే నడుం వంచి ప్రార్థించవచ్చు. అందుకే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు. శరీర భౌతిక నిర్మాణాన్ని బట్టి ఈ సూచన చేశారు. పూజ పూర్తైన తర్వాత భగవంతుడికి  సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి.