హైదరాబాద్‌కు ఉన్న ఉన్న ఆకర్షణల్లో ఇప్పుడు కొత్తగా సమతామూర్తి విగ్రహం (  Samata moorthy ) చేరింది. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో అన్నీచూసేసిన వారు కూడా ఇప్పుడు ముచ్చింతల్‌లోని ( Muchintal ) సమతా  మూర్తిని చూడాలనుకుంటున్నారు. అయితే చాలా మంది అక్కడి పద్దతులు..,పరిస్థితులు.. టైమింగ్స్ తెలియక ఇబ్బంది పడుతున్నారు. భక్తుల ఈ ఇబ్బందులను గమనించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వాహకులు గైడ్ లైన్స్ విడుదల చేశారు.


శ్రీరామనగరం ( Sri rama Nagaram ) , ముచ్చింతల్‌, శంషాబాద్‌లో వెలసిన ప్రపంచ ప్రఖ్యాత సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో మార్చి 29 నుంచి మండల అభిషేకాలు, ఆరాధనలను ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఆ రోజుల్లో భక్తులకు ప్రవేశం ఉండదు.  మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు నాలుగు రోజుల పాటు ఆరాధనా సౌకర్యానికి సందర్శకులకు ప్రవేశం ఉండదు. ఏప్రిల్‌ 2 అనగ ఉగాది నూతన సంవత్సర శోభతో, సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభమవుతుందని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వాహకులు ప్రకటించారు. 


రాజును నొప్పిస్తే రాజగురువుకైనా కష్టాలే ! యాదాద్రి - చినజీయర్ కథలో నీతేమిటంటే ?


సమతామూర్తిని ప్రతి రోజూ   ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు  దర్శించుకోవచ్చు. అయితే వారంలో బుధవారం ( Wed ) మాత్రం సెలువుగా ప్రకటించారు. ఆ రోజున ఎవరినీ అనుమతించారు.  ప్రవేశ రుసుములో ఎలాంటి మార్పు లేదు అంటే రూ. 150 వసూలు చేస్తారన్నమాట.  సెల్‌ఫోన్‌, కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్‌ పరికరాలను లోనికి అనుమతించరు. జ్ఞాపకంగా ఫోటోలు కావాలంటే లోపల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో వెళ్లాల్సి ఉంటుంది.  పాదరక్షలు బయటే వదలాలి. ఎటువంటి ఆహార పానీయాలకు లోపలికి అనుమతించరు. 


వాళ్లకు కళ్లు లేవు, సమ్మక్క సారలమ్మ ఇష్యూపై చిన జీయర్ రియాక్షన్


ఇటీవల సమతామూర్తి స్పూర్తి కేంద్రం ప్రారంభమయింది. పెద్ద ఎత్తున భక్తులుతరలివస్తున్నారు. అక్కడి వరకు సిటీ బస్సుల సౌకర్యం కూడా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ట్విట్టర్‌లో ఓ భక్తుడు .. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయన ముచ్చింతల్‌కు బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రవాణా కూడా అందుబాటులోకి వస్తే సమతామూర్తిని సందర్శించే భక్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది.