శరణుఘోషతో శబరిమలకు చేరుకునే అయ్యప్ప భక్తుల కోసం పెద్దపాదం మార్గాన్ని తిరిగి తెరుస్తున్నట్టు ప్రకటించారు అటవీ అధికారులు. ఎరిమేలు, వలియనవట్టం, చెరియనవట్టం, పంపా, మరకొట్టం, పెరూర్‌తోడు, కాలైకట్టి రూట్లు ఈ నెల 31 నుంచి అంటే.. శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. పెద్దపాదం మార్గంలో పాదయాత్ర చేస్తూ స్వామివారిని చేరుకోవాలంటే దట్టమైన అరణ్యంలో కొండల మధ్య కాలిబాటన ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇరుముడిని తలపై పెట్టుకుని ఈ మార్గంలో వెళ్లాలనేది ప్రతి అయ్యప్ప భక్తుడి కోరిక. ఇప్పుడు ఈ మార్గంలో అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేవస్థానం బోర్డు.
Also Read: మధుబన్ లో ఏం జరిగింది, సన్నీ లియోన్ సాంగ్ పై ఎందుకీ వివాదం..
పెద్దపాదం నుంచి అయ్యప్ప ఆలయానికి చేరుకునేందుకు... ఎరుమేలి నుంచి నడిస్తే దాదాపు 60 కిలోమీటర్లు. కరిమల, వలియనవట్టం, చెరియనవట్టం, పంపా, మరకొట్టం, పెరూర్‌తోడు, కాలైకట్టి, అలుదా నది మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఇప్పటికే ఈ రూట్ మొత్తం క్లియర్ చేసిన అధికారులు డిసెంబర్ 30వ తేదీ గురువారం చివరిసారిగా మరోసారి తనిఖీలు చేయనున్నారు. ఇది పెరియార్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏ ఒక్కరిని అనుమతించబోమని తెలిపారు. అయ్యప్పలకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే .. 2021, డిసెంబర్ 29వ తేదీ బుధవారం నుంచి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను రోజుకు 45 వేల నుంచి 60 వేలకు పెంచింది.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
అయ్యప్ప భక్తులు పాటించాల్సిన నిబంధనలు
వర్చువల్ క్యూ బుకింగ్ వ్యవస్థ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న భక్తులు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలను చూపించక పోయినా, సింగిల్ డోస్ వేసుకున్నా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ అందజేయాలి. ఈ నిబంధనలను పాటించని వారిని స్వామివారి దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరు.
Also Read: కోరిన కోర్కెలు తీర్చే చింతల వెంకటరాయుడు సన్నిది.. ఇతర రాష్ట్రాల వారినీ ఆకర్షిస్తున్న పురాతన క్షేత్రం
Also Read: రోజూ పెరుగుతున్న దేవుడి విగ్రహం.. విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Also Read: మన పాప పుణ్యాల చిట్టా రాసేవాడికీ ఆలయాలున్నాయ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి