హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు ఆస్థానంలో ఉంటూ మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడే చిత్రగుప్తుడు.
చిత్రగుప్తుడు ఎలా ఉద్భవించాడు
పురాణ కథల ప్రకారం మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు బ్రహ్మ. యముడు తన దగ్గరికి వచ్చే ఆత్మలను నియంత్రించలేక కొన్నింటిని స్వర్గానికి మరికొన్నింటిని నరకానికి పంపడంలో పొరపాట్లు జరిగేవట. నిర్వహణ కష్టంగా ఉందని యముడు..బ్రహ్మకు చెప్పడంతో ఆ సమస్య పరిష్కరించేందుకు కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేశాడట. ఓ రోజు కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక వ్యక్తి కలం, కాగితం పట్టుకుని కనిపించాడు. బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించడంతో ఆయన వారసులను 'కాయస్థులు' అని అంటారు. అంటే బ్రహ్మ మనసులో ఆలోచనగా మొదలై(చిత్ర)..మిగతా దేవతలకు తెలియకుండా (గుప్తంగా) సృష్టించడంతో చిత్రగుప్తుడయ్యాడు.
Also Read: ఈ వైపు వీధిపోటు ఉంటే యజమానికి మరణం, ఆ ఇంట వారసులు ఉండరు
దక్షిణ భారతదేశంలో చిత్రగుప్తుడి ఆలయాలు
- హైదరాబాద్ లోని ఫలక్ నామా, కందికల్ గేటు దగ్గర చిత్రగుప్త మహాదేవ దేవాలయం ఉంది. 250 సంవత్సరాల క్రితం నాటి ఈ దేవాలయానికి అప్పుడప్పుడు చిత్రగుప్తుడు వచ్చి పోతుంటాడని చెబుతారు. నవాబుల కాలంలో మంత్రిగా ఉన్న రాజా కిషన్ పర్షాద్ ఈ గుడిని అభివృద్ధి చేశారంటారు.
- మరో ఆలయం తమిళనాడు కంచిలో ఉంది. క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దంలో చోళులు నిర్మించారు. పురావస్తుశాఖ తవ్వకాల్లో పంచలోహ విగ్రహం బయటపడింది.
Also Read: ఈమె కూడా బ్రహ్మంగారిలానే.. ఏం జరగబోతుందో ముందే చెప్పేస్తుంది..
ఉత్తర భారతదేశంలో చిత్రగుప్తుడి ఆలయాలు
- అయోధ్యలో ఉన్న చిత్రగుప్తుడి ఆలాయాన్ని రాముడు కొలిచినట్టు పురాణాలు చెబుతున్నాయి. దీనినే ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అంటారు. లక్నో లో కూడా ఒక ఆలయం ఉన్నది.
- మధ్యప్రదేశ్ లో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త ఆలయాలున్నాయి. జబల్పూర్ లోని ఫుటాతాల్ లో ఒకటి, శిప్రా నదీ తీరంలోని రాంఘాట్ వద్ద మరొకటి, ఉజ్జయినిలో మరో రెండు దేవాలయాలు ఉన్నాయి. ఈ నాలుగు దేవాలయాలు రెండవ శతాబ్దానికి చెందినవిగా చెబుతారు.
- రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ లో మూడో శతాబ్దంలో కట్టించిన చిత్రగుప్త దేవాలయం, ఉదయపూర్ లో మరో చిత్రగుప్త ఆలయం ఉంది.
Also Read: ఆమె చెబితే జరిగిపోతుందంతే.. 2022లో కరోనాని మించిన ప్రాణాంతక వైరస్..
చిత్రగుప్తుడి ఫ్యామిలీ ఇది
చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సూర్య దక్షిణ నందిని, మరొక భార్య పార్వతీ శోభావతి. మొదటి భార్యకు నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. రెండవ భార్య కు ఎనిమిది మంది కుమారులు, ఎనిమిది మంది కుమార్తెలు.
Also Read: మధుబన్ లో ఏం జరిగింది, సన్నీ లియోన్ సాంగ్ పై ఎందుకీ వివాదం..
చిత్రగుప్తుడిని ఎందుకు పూజించాలి
చిత్రగుప్తుడంటే పాపపుణ్యాల చిట్టాకోసం మాత్రమే కాదు...ఆరోగ్యం, సంతానం, చదువు, పెళ్లికి సంబంధించి సమస్యలున్నా పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం. చిత్రగుప్తుడి ఆలయంలో గ్రహదోష నివారణ పూజలు నిర్వహిస్తుంటారు.
Also Read: అసలు గుడికి ఎందుకు వెళ్లాలి, ఇంత పరమార్థం ఉందా..!
Also Read: ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి