శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 14 గురువారం పంచాంగం


తేదీ: 14-07 -2022
వారం:  గురువారం  
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం
తిథి  : పాడ్యమి గురువారం  రాత్రి 10.07 వరకూ తదుపరి విదియ
నక్షత్రం:  ఉత్తరాషాడ రాత్రి 10.47 వరకు తదుపరి శ్రవణం
వర్జ్యం :  ఉదయం 7.52 నుంచి 09.21 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 9.56 నుంచి  10.48 వరకు 
అమృతఘడియలు  : సాయంత్రం 4.49 నుంచి 6.18 వరకు తిరిగి రాత్రి 2.31 నుంచి తెల్లవారుజామున 4.00 వరకు 
సూర్యోదయం: 05:36
సూర్యాస్తమయం : 06:34


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: జులై 14 గురువారం రాశిఫలాలు ఇక్కడ చూసుకోవచ్చు



Also Read:  మహాభారతంలో ఈ పాత్రల్లో మీరు ఏటైపు, ఓ సారి చూసుకోండి


పాఠకులకోసం శ్రీరామ పంచ రత్న స్త్రోత్రం, రామాయణ జయ మంత్రం


శ్రీ రామ పంచ రత్న స్తోత్రం


కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 1 ॥


విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ
వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 2 ॥


సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 3 ॥


పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 4 ॥


నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ
నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 5 ॥


ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ ॥


ఇతి శ్రీశంకరాచార్య విరచిత శ్రీరామపంచరత్నం సంపూర్ణం


Also Read: రోజూ పెరుగుతున్న దేవుడి విగ్రహం.. విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


రామాయణ జయ మంత్రం


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।


దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥


న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ।


అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥


పూర్వ కాలంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు రామాయణ జయ మంత్రాన్ని స్మరించుకుంటూ వెళ్లేవారు. రామాయణ జయమంత్రం పఠించి వెళితే అనుకున్న పని శుభప్రదంగా పూర్తై క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని నమ్మేవారు. ఇప్పటికీ చాలామందికి ఆ విశ్వాసం ఉంది. 


Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట