మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలివి
దాన ధర్మాలు చేస్తే సరిపోదు-కర్ణుడు
జాలి, దయ, మంచితనం, దానం, ధర్మం, శూరత్వం ఇవన్నీ ఉంటే గెలుపు సాధ్యం అవుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సమయాన్ని బట్టి నడుచుకోవడం సాధ్యమైతే విజయం సాధించగలం. ఇందుకు  ఉదాహరణ కర్ణుడు. దానవీరశూర కర్ణుడే అయినప్పటికీ చెడు(కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మీరెంత మంచివాళ్లైనా మీరు మంచిని సపోర్ట్ చేయకపోతే జీవితంలో గెలవలేరన్నది సత్యం. 


చెడు స్నేహం-శకుని
మీ స్నేహితులెవరో చెప్పండి మీ గురించి చెబుతాం అంటారు కొందరు. ఆ మాట నిజమే..ఎందుకంటే చెడు స్నేహం ఊహకందని విధంగా మీ కెరీయిర్, జీవితాన్ని నాశనం చెస్తుంది. మహాభారతంలో ఇలాంటి క్యారెక్టర్ శకుని. కౌరవులతో స్నేహంగా ఉంటూనే వారు కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటివారు మన జీవితంలో చాలామంది ఉంటారు..అది తెలుసుకున్నప్పుడే ఉన్నతి సాధ్యం అవుతుంది.
 
నిజమైన స్నేహం-కృష్ణుడు
ఎలాంటి బేధాలు లేని, నిస్వార్థమైన స్వచ్ఛమైన స్నేహం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. ఇందుకు ఉదాహరణ శ్రీకృష్ణుడితో పాండవుల స్నేహమే.  రాజ్యం నుంచి బయట అడుగుపెట్టినప్పటి నుంచి మహాభారత యుద్ధం ముగిసి మళ్లీ రాజ్యంలోకి అడుగుపెట్టేవరకూ అడుగడుగునా శ్రీకృష్ణుడు ఎంత సపోర్ట్ గా నిలిచాడో చెప్పుకోవాల్సిన అవసరం లేదు.  కుల,మత, పేద , ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.


Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 


కాంక్ష,కోపం-దుర్యోధనుడు
కౌరవుల తల్లి అయిన గాంధారికి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటం వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటం కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష, ఎదుటివారికి చెడు చేయాలన్న ఆలోచన కారణంగా కౌరవులు నాశనం అయ్యారు.


మన పనులు మనమే చేసుకోవాలి-పాండవులు
ఎవరి పనులు వారే చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. రాజ భోగాలు అనుభవించిన పాండవులు అరణ్య వాసం, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ల పనులు వాళ్లే చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎంత గొప్పవారం అన్నది కాదు అవసరమైన సమయంలో ఏదైనా చేసేవా ఉండాలి. మన పనులు మనం చేసుకోవడానికి చిన్నతనంగా భావించకూడదు. 


చిత్తశుద్ధితో-పాండవులు
మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ తమ కష్టాన్నే నమ్ముకున్నారు, చిత్తశుద్ధితో పోరాడి విజయం సాధించారు. ఎదురుగా ఉన్నది ఎంత కష్టం అన్నది కాదు దాన్ని అధిగమించేందుకు మనలో ఉన్న బలం ఏంటో తెలుసుకోవాలి.


అతి ఎప్పుడూ పనికిరాదు-ధృత రాష్ట్రుడు
అతి ప్రేమ నష్టం కలిగిస్తుందనేందుకు ధృతరాష్ట్రుడే ఉదాహరణ. బిడ్డల మీద ప్రేమ ఓ వైపు, నమ్ముకున్న సిద్ధాంతాలు మరోవైపు ఎటూ తేల్చుకోలేక నిలిగిపోయాడు. కొడుకుల వినాశనం అంతా చూస్తున్నా వారు తప్పులు చేస్తున్నా ఆపలేకపోయాడు, మందలించలేకపోయాడు. పిల్లలపై ప్రేమతో వాళ్లు చేసే తప్పులు కూడా క్షమిస్తూ పోతే అది వాళ్ల వినాశనానికి దారితీస్తుంది అనేందుకు ఇంతకు మించిన ఉదాహరణ ఏముంది. పిల్లలపైనే కాదు ఎవ్వరిపైనా అతి ప్రేమ, అతి నమ్మకం పనికిరాదు. 


నిత్య విద్యార్థి
నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ ఇంతటితో చాలు అని ఉండదు.  మహాభారతంతో ఇందుకు సరిపడా క్యారెక్టర్ అర్జునుడు. జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాడు.ద్రోణుడి నుంచి విలువిద్య, ఇంద్రుడి నుంచి  దైవ సంబంధమైన ఆయుధాలు వాడకం, మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు- కృష్ణుడి నుంచి మరెన్నో రాజనీతులు మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. 


శత్రువుల్లో కూడా మంచి చేసేవారుంటారు
కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే. బీష్మ , విదుర , ద్రోణులు రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారు. ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడే. 


స్త్రీని ఆపద నుంచి కాపాడడం
ద్రౌపది ఐదుగురు భర్తలూ సంపన్నులూ, అత్యంత బలవంతులు. కానీ నిండు సభలో అవమానాన్ని ఆపలేకపోయారు. మీరు ఎంత బలవంతులైనా కష్టంలో ఉన్న స్త్రీకి సహాయం చేసినప్పుడే మీ బలం సఫలం. 


అర్థజ్ఞానం ప్రమాదకరం
అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం. ఇందుకు ఉదాహరణ అభిమన్యుడు. పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక పోవడం వల్ల మహావీరుడైన అభిమన్యుడు నేలరాలిపోయాడు. అందుకే ఎంతబాగా తెలిసినా పూర్తిగా క్లారిటీ వచ్చే వరకూ రిస్క్ చేయకూడదు. అలాకానప్పుడు ఆ పనిని మధ్యలోనే వదిలేయాలి. 


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?


స్త్రీ తలుచుకుంటే చాలు
ఆడవాళ్లు తలుచుకుంటే రాజ్యాలు నాశనమైపోతాయ్ అన్న మాట ఇక్కడి నుంచి పుట్టుకొచ్చినదే.   కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది.


తపన ఉండాలే కానీ నిన్ను ఆపలేరెర్వరూ
అర్జునుడే అతిపెద్ద విలుకాడు అనుకుంటే పొరపాటే..ఎందుకంటే కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురు శిక్షణ లేకున్నా అర్జునుడి కన్నా ఏకలవ్యుడు వీరుడు. అంటే ఏదైనా సాధించాలంటే ముందుగా అమితమైన ఆసక్తి ఉండాలి. 


వ్యూహం తప్పనిసరి
వ్యూహం చాలా ముఖ్యమం.  కృష్ణుడు వ్యూహం లేకపోతే పాండువులు విజయాన్ని సాధించడం అన్నది జరగని పని. ఎంత సామర్థ్యం ఉన్నది అన్నది కాదు...మంచి ప్లాన్ ఉంటేనే ఆ పనని సక్రమంగా పూర్తిచేయగలరు.