Bhadrachalam Danger Zone :   గోదావరికి పోటెత్తుతున్న వరదలతో భద్రాచలం డివిజన్ మొత్తం ప్రమాదంలో పడింది. భద్రాద్రి జి్లలా కలెక్టర్ అనుదీప్ ఈ అంశంపై అధికార వర్గాలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.  ఎగువ ప్రాంతాల్లో ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి.  మేడిగడ్డ, సమ్మక్క సాగర్ వరద నీటి ఉధృతితో  నిండిపోయాయి.  
వచ్చే రెండు రోజుల్లో గోదావరి లో వరద 21 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారణంగా గోదావరి నీటి మట్టం 64 అడుగులకు చేరుతుందని అదే జరిగితే భద్రాచలం డివిజన్ మొత్తం ముంపులో ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


విపత్తును ఎదుర్కొనేందుకు అధికారవర్గం సన్నద్ధం ! 


ఈ పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తూండటంతో కలెక్టర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  గోదావరి మట్టం 64 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా సిద్ధం కావాలని సమీక్ష నిర్వహించారు. చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, పినపాక, మణుగూరు, బూర్గంపాడు, భద్రాచలంలోని అన్ని ప్రభావిత గ్రామాలను తక్షణం తరలించాలని అధికారులను ఆదేశించారు.  సహాయ శిబిరాలను వెంనే ఏర్పాటు చేయాలన్నారు. సాయంత్రంలో లోపు ముంపు గ్రామాల్లో ఒక్కరు కూడా ఉండకుండా తలించాలని స్ప్టం చేశారు. దుమ్ముగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు.  అన్ని దేశీ పడవలను, ఈతగాళ్లను, బృందాలను వెంటనే అప్రమత్తం చేశారు. 


సహాయశిబిరాలకు ముంపు ప్రాంత గ్రామాల ప్రజల తరలింపు


 మంత్రి పువ్వాడ సమీక్ష: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇతర అధికారులతో కలిసి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.  విపత్కర పరిస్థితులు వచ్చినా అధికారులు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.


వందేళ్ల చరత్రలో ఎప్పుడూ రానంత వరద 


 వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సాధారణంగా జులై నెలలో గోదావరికి వరదలు వచ్చినా ఈ స్థాయిలో ఎప్పుడూ రాలేదు. జులైలో వరదలు వచ్చినా లక్ష క్యూసెక్కుల లోపే ఉండేవని గణాంకాలు చెబుతున్నాయి. ఆ రికార్డును ప్రస్తుతం వరదలు బ్రేక్ చేసినట్లు కనిపిస్తుంది. 13లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం గోదావరిలో కొనసాగుతోంది. ఇది క్రమంగా పెరుగుతోంది. గోదావరి వరద శాంతిచకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.