Nagpur Car Washed Away: భారీ వర్షాలు, వరదలతో మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. ఇప్పటికే వర్షాలు, వరదల కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 83 మంది మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
తాజాగా నాగ్‌పుర్‌లో ఓ వాహనం వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అయితే వాహనం కొట్టుకుపోతున్న ఏ ఒక్కరూ కనీసం కాపాడేందుకు ప్రయత్నించలేదు.
ఇదీ జరిగింది
నాగ్‌పుర్ సావ్నెర్ మండలం కేల్వాద్ దగ్గర నందా నదిలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ ముల్తాయికి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక కోసం నాగ్‌పుర్‌కు వచ్చింది. తిరిగి ఊరికి వెళ్తున్న క్రమంలో వాళ్ల వాహనం బ్రిడ్జిపై వెళ్తుండగా.. హఠాత్తుగా వరద ముంచెత్తి నదిలో చిక్కుకుపోయింది. వరద ఉద్ధృతికి నిమిషాల్లోనే వాహనం కొట్టుకుపోయింది.
ధైర్యం చేయలేదు
ఆ సమయంలో వంద మందికిపైగా అక్కడే ఉన్నారు. అయితే వరద ఉద్ధృతికి భయపడి ఏ ఒక్కరూ సాహసించలేదు. అంతా చూస్తుండగానే వాహనం మునిగి కొట్టుకుపోయింది. నిస్సహాయంగా చూస్తూ రక్షించే ప్రయత్నాలు చేయలేకపోయారు గ్రామస్థులు. వాహనంలో ఉన్న ప్రయాణికులు రక్షించండి అంటూ చేతులు పైకి పెట్టి హాహాకారాలు చేశారు. కొందరు మొబైల్స్‌లో వీడియోలు తీస్తూ ఉండిపోయారు.
ఉన్నతాధికారులకు సమాచారం అందించినా వాళ్లు వచ్చేసరికి ఆలస్యం అయింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు వాహనంతో పాటు గల్లంతయ్యారు. వాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. మరోవైపు వరదల సమయంలో ఇలాంటి సాహసాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. వరద ఉద్ధృతి పెరిగితే వాహనం కంట్రోల్ తప్పుతుందని, ప్రాణాలు పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Also Read: Mamata Banerjee Darjeeling Visit: పానీపూరి వద్దురా నాయనా అంటే, తయారు చేసి మరీ ఇచ్చిన సీఎం!
Also Read: Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- 45 మంది మృతి