Mamata Banerjee Darjeeling Visit: దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిల్వ ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఫుడ్ ముఖ్యంగా పానీపూరి లాంటివి తినొద్దని సూచిస్తున్నారు. అయితే మరోవైపు ఏకంగా ఓ రాష్ట్ర సీఎం స్వయంగా పానీపూరి చేసి పంచిపెడుతున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయింది.
తిను బాబు!
బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ డార్జిలింగ్‌లో పర్యటిస్తున్నారు. గుర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు మూడు రోజుల పాటు దీదీ డార్జిలింగ్‌లోనే ఉంటారు. అయితే ప్రజలు కనిపిస్తే దీదీ వెంటనే వారితో కలిసిపోతారు. వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు.
ఈ పర్యటనలో రోడ్డు పక్కన ఓ పానీ పూరీ స్టాల్ వద్దకు దీదీ వెళ్లారు. స్వయం సహాయక బృందాలు ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆ స్టాల్ వద్ద వారితో కలిసి పానీపూరీ తయారు చేశారు. అలాగే పిల్లలు, ఇతరులకు ఆత్మీయంగా తిను బాబు అంటూ ఇచ్చారు. మమతా బెనర్జీ పానీపూరి ఇస్తోన్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
అంటువ్యాధులు
ఈ కాలంలో ప్రజలు రోడ్లపై లభ్యమయ్యే పానీపూరీ వంటివాటికి దూరంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పానీపూరీలో వినియోగించే అపరిశుభ్ర నీటి వల్ల రోగాలు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. సీజనల్ వ్యాధులైన టైఫాయిడ్, మలేరియా సహా పలు వైరల్ జ్వరాలు వస్తాయని తెలిపారు. ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Also Read: Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- 45 మంది మృతి
Also Read: President Murmu : ఎన్డీఏ అభ్యర్థికి అనూహ్యమైన మద్దతు - ద్రౌపది ముర్ముకు భారీ ఆధిక్యం ఖాయమే !