Mumbai Landslide: విరిగిపడిన కొండచరియలు- శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయకచర్యలు

Mumbai Landslide: మహారాష్ట్రలోని వసాయ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Continues below advertisement

Mumbai Landslide: భారీ వర్షాల ధాటికి మహారాష్ట్రలో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు . తాజాగా వసాయ్‌లో బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Continues below advertisement

ఇలా జరిగింది

వసాయ్‌లోని వాగ్రపాడు ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి నలుగురిని కాపాడురు.  ఓ బాలిక ఇంకా శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

కొట్టుకుపోయిన కారు

నాగ్‌పుర్‌ సావ్నెర్‌ మండలం కేల్వాద్‌ దగ్గర నందా నదిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌ ముల్తాయికి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక కోసం నాగ్‌పుర్‌కు వచ్చింది. తిరిగి ఊరికి వెళ్తున్న క్రమంలో వాళ్ల వాహనం బ్రిడ్జిపై వెళ్తుండగా.. హఠాత్తుగా వరద ముంచెత్తి నదిలో చిక్కుకుపోయింది. వరద ఉద్ధృతికి నిమిషాల్లోనే వాహనం కొట్టుకుపోయింది.

ఇప్పటికే వర్షాలు, వరదల కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 83 మంది మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.  

Also Read: Sri Lanka Crisis: 'మాకు ఏం సంబంధం లేదు'- ఆ వార్తలను ఖండించిన భారత్

Also Read: Elon Musk vs Trump: ట్రంప్‌ రిటైర్‌ అవ్వాలంటూ మస్క్ ట్వీట్- షాకిచ్చిన నెటిజన్లు!

Continues below advertisement