Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పరారవడంలో భారత్ పాత్ర ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయాణానికి భారత్ సహకరించిందంటూ శ్రీలంకలోని కొన్ని మీడియా సంస్థలు నిరాధార వార్తలను ప్రసారం చేశాయి. వాటిని ఆ దేశంలోని భారత హైకమిషన్ తోసిపుచ్చింది.
సాయానికి రెడీ
మరోవైపు శ్రీలంక ప్రజలకు తమ మద్దతు కొనసాగుతుందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఎలాంటి సాయానికైనా భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హైకమిషన్ వెల్లడించింది
పరార్
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయకుండా దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.
మాల్దీవులు ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది. మరోవైపు, శ్రీలంక ప్రభుత్వ ఆదేశాల మేరకే అధ్యక్షుడిని తరలించామని ఆ దేశ వాయుసేన ప్రకటించింది.
ఎమర్జెన్సీ
అధ్యక్షుడు పారిపోవడంతో నిరసనకారులు కొన్ని చోట్ల సంబరాలు చేసుకున్నారు. మరికొంతమంది గొటబాయను దేశం విడిచి పారిపోయేందుకు ప్రభుత్వం సహకరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. దేశంలో మళ్లీ హింసాత్మక ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: Elon Musk vs Trump: ట్రంప్ రిటైర్ అవ్వాలంటూ మస్క్ ట్వీట్- షాకిచ్చిన నెటిజన్లు!
Also Read: Sri Lanka Crisis: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ- అధ్యక్షుడు పారిపోవడంతో తప్పలేదు!