Elon Musk vs Trump: ట్రంప్‌ రిటైర్‌ అవ్వాలంటూ మస్క్ ట్వీట్- షాకిచ్చిన నెటిజన్లు!

ABP Desam   |  Murali Krishna   |  13 Jul 2022 12:39 PM (IST)

Elon Musk vs Trump: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. డొనాల్డ్ ట్రంప్‌పై కామెంట్ చేశారు. రాజకీయాల నుంచి ఆయన రిటైర్ కావాలని సూచించారు.

ట్రంప్‌ రిటైర్‌ అవ్వాలంటూ మస్క్ ట్వీట్- షాకిచ్చిన నెటిజన్లు!

Elon Musk vs Trump: టెస్లా సీఈఓ, బిలియనీర్ ఎలాన్ మస్క్.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మస్క్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఇక రాజకీయాల నుంచి రిటైర్ కావడం ఉత్తమమంటూ కామెంట్ చేశారు.

 నాకు ట్రంప్ అంటే ఎలాంటి ద్వేషం లేదు, కానీ ఆయన రాజకీయాల నుంచి ఇక రిటైర్ అయి హాయిగా గడపాలి. అధ్యక్షుడు బైడెన్ పదవీకాలం ముగిసేనాటికి ట్రంప్‌ వయసు 82 ఏళ్లవుతుంది. అమెరికా సహా దేనికైనా సీఈఓగా వ్యవహరించడానికి ఆ వయసు చాలా ఎక్కువ. డెమోక్రటిక్‌ పార్టీవాళ్లు కూడా ట్రంప్‌పై విమర్శలు చేయడం మానుకోవాలి.                                                        -  ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ

మరో ట్వీట్

దీంతో పాటు ట్విట్టర్‌లో మరో పోల్ పెట్టారు మస్క్. 'హేట్ ట్రంప్, హేట్ మస్క్'లో ఏది ఎన్నుకుంటారు అంటూ ట్వీట్ చేశారు. ఆ పిక్చర్‌లోనే ఎక్కువ మంది లెఫ్ట్ (ఎడమ వైపు) ఉన్నది సెలక్ట్ చేస్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇద్దరినీ హేట్ చేస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

ట్రంప్

గత శనివారం అలస్కాలో జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్‌పై ట్రంప్‌ పలు విమర్శలు చేశారు. ఇప్పటి వరకు తానెప్పుడూ రిపబ్లికన్‌ పార్టీకి ఓటు వేయలేదని మస్క్‌ ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. దాన్ని ప్రస్తావించిన ట్రంప్‌.. మస్క్‌ తనకే ఓటేసినట్లు గతంలో ఓసారి తనకు చెప్పారన్నారు. మరోవైపు ట్విటర్‌ డీల్‌ నుంచి మస్క్‌ వెనక్కి తగ్గడంపైనా ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. అయితే మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటికీ తాను తిరిగి ఆ సోషల్ మీడియాను వినియోగించనని ట్రంప్ అంతకుముందు ఓసారి అన్నారు.

Also Read: Sri Lanka Crisis: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ- అధ్యక్షుడు పారిపోవడంతో తప్పలేదు!

 Also Read: Watch: నయాగరా అనుకున్నారా? జోగ్ జలపాతం, ఇది అంతకుమించి- కుదిరితే ఓసారి వెళ్లి రండి!

Published at: 13 Jul 2022 12:35 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.