Watch: వర్షాకాలంలో జలపాతాల అందాలు మామూలుగా ఉండవు కదా! ప్రపంచంలోనే ఎంతో అందమైన జలపాతంగా పేరున్న నయాగరాకు ఇప్పుడు ఎక్కడ  వెళ్లగలం అనుకోకండి. ఆ నయాగరా జలపాతాన్ని తలదన్నే వాటర్ ఫాల్స్ మన దేశంలో కూడా చాలానే ఉన్నాయి. భారీ వర్షాలకు కర్ణాటకలోని జోగ్ జలపాతం అందాలు పర్యటకులకు కనువిందు చేస్తున్నాయి. కుదిరితే ఈ జలపాతాన్ని చూసేయండి.






తాజాగా జోగ్ జలపాతానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎరిక్ సోల్‌హైమ్ అనే విదేశీయుడు ఈ జలపాతం వీడియోను షేర్ చేశారు. ఇది నయాగరా జలపాతం అనుకుంటున్నారా? కాదు.. ఇది జోగ్ జలపాతం, కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంది అంటూ ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. అయితే ఆయనకు భారత్‌లో మరిన్ని జలపాతాలు ఉన్నాయంటూ భారతీయులు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణలో ఉన్న బుగత జలపాతాన్ని కూడా సందర్శించాలని కొంతమంది కామెంట్ చేశారు.


నయనానందం


దేశంలో రెండో అతిపెద్ద జలపాతమైన జోగ్ అందాలను తిలకించేందుకు పర్యటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జోగ్ జలపాతం ఉంది.


ప్రస్తుతం కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జోగ్ జలపాతం అందాలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. శివమొగ్గలో రాజా, రాణి, రోయర్, రాకెట్ అనే మరో నాలుగు జలపాతాలు కూడా ఉన్నాయి.


ఇలా వెళ్లొచ్చు


బెంగళూరు నుంచి శివమొగ్గకు రైల్లో వెళ్లొచ్చు. శివమొగ్గ రైల్వే స్టేషన్ నుంచి జోగ్ వాటర్‌ఫాల్స్ 100 కి.మీ. దూరంలో ఉంది. బెంగళూరు, మైసూర్ శివమొగ్గ నుంచి జోగ్ జలపాతం వరకు కర్ణాటక ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.


విమానంలో వెళ్లాలనుకుంటే మంగళూరు వెళ్లి.. అక్కడి నుంచి శివమొగ్గ చేరుకోవచ్చు. మంగళూరు నుంచి శివమొగ్గ దాదాపు 200 కి.మీ దూరంలో ఉంది. 


Also Read: United Kingdom Heatwave: భారత్‌లో వాన దంచికొడుతుంటే యూకేలో ఉక్కబోస్తుంది- ఎమెర్జెన్సీ ప్రకటిస్తారా?


Also Read: Nagpur Car Washed Away: కళ్ల ముందే కొట్టుకుపోయిన కారు! ఒక్కరు కూడా ధైర్యం చేయలేదు- ముగ్గురు మృతి