United Kingdom Heatwave: భారత్‌లో వర్షాలు దంచికొడుతుంటే బ్రిటన్‌లో ఎండలు మండిపోతున్నాయి. యూకేలో వడగాడ్పులతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో జనం ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాడ్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు.
ప్రభుత్వం హెచ్చరిక
దేశంలో కొన్ని రోజుల్లో వడగాడ్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే వాతావరణ అత్యవసర స్థితిని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.
బ్రిటన్‌లో చాలా ప్రాంతాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఇది 104 డిగ్రీల ఫారన్‌హీట్ (40 డిగ్రీల సెల్సియస్) గరిష్ఠ స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
ఎక్కువైతే
ఈ వడగాడ్పుల కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడడంతోపాటు ప్రాణాపాయస్థితి ఏర్పడుతుందని బ్రిటన్ ఆరోగ్య విభాగం హెచ్చరించింది. దీంతో 'లెవల్ 4' జాతీయ అత్యయిక స్థితి ప్రకటించడంపై చర్చించేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. హీట్ వేవ్ ఇలానే ఉంటే ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అత్యవరసర పరిస్థితి అయితేనే బయటకు రావాలని సూచించారు.
Also Read: Nagpur Car Washed Away: కళ్ల ముందే కొట్టుకుపోయిన కారు! ఒక్కరు కూడా ధైర్యం చేయలేదు- ముగ్గురు మృతి
Also Read: Mamata Banerjee Darjeeling Visit: పానీపూరి వద్దురా నాయనా అంటే, తయారు చేసి మరీ ఇచ్చిన సీఎం!