Nirjala Ekadashi and Rama Lakshmana Dwadashi 2024: ఏటా జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఏడాదికి వచ్చే 24 ఏకాదశులు దేనికదే విశిష్టమైనది. సాధారణంగా ఏకాదశి ఉపవాస నియమాలు దశమి రోజు రాత్రి నుంచి ప్రారంభమవుతాయి. ద్వాదశి రోజు ప్రత్యేకపూజ ఆచరించి, దాన ధర్మాలు చేసిన అనంతరం ద్వాదశి ఘడియలు మించిపోకుండా భోజనం చేస్తారు.ఏ ఏకాదశికి అయినా ఇవే నియమాలు పాటిస్తారు. అయితే నిర్జల ఏకాదశిరోజు మాత్రం కనీసం నీరు కూడా ముట్టుకోకుండా వ్రతం ఆచరిస్తారు..అందుకే నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజు ఎంత ప్రాముఖ్యమైనదో ఈ తర్వాత రోజు వచ్చే ద్వాదశి మరింత విశిష్టమైనంది. దీనినే రామలక్ష్మణ ద్వాదశి అంటారు. 


జూన్ 18 రామలక్ష్మణ ద్వాదశి


ఈ ఏడాది నిర్జల ఏకాదశి, చంపక ద్వాదశి విషయంలో కొంత గందరగోళం ఉంది.. అయితే సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు నిర్జల ఏకాదశి జూన్ 17 సోమవారం వచ్చింది. ఏకాదశి ఘడియలు జూన్ 17 రాత్రి తెల్లవారితే 4.26 వరకే ఉన్నాయి... అంటే జూన్ 18 సూర్యోదయానికి ఏకాదశి ఘడియలు పూర్తై ద్వాదశి వచ్చింది. ద్వాదశి ఘడియలు కూడా జూన్  19 తెల్లవారుజామన 5.35 వరకూ ఉన్నాయి..అంటే జూన్ 19 బుధవారం సూర్యోదయానికి ద్వాదశి తిథి లేదు..అందుకే ఏకాదశి ఉపవాసం పాటించాలి అనుకున్న వారు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభించి మంగళవారం ఉదయం వరకూ అనుసరిస్తారు. రామలక్ష్మణ ద్వాదశి వ్రతం చేయాలి అనుకుంటే జూన్ 18 మంగళవారం ఉదయం నుంచి జూన్ 20 బుధవారం ఉదంయ వరకూ పాటించాలి....


Also Read: ఎవ్వరూ చూడడం లేదు అనుకుంటే ఎలా...మిమ్మల్ని మౌనంగా గమనించే 18 సాక్షులు ఇవే!


రామలక్ష్మణ ద్వాదశి విశిష్టత


త్రేతాయుగంలో అయోధ్యను పాలించిన దశరథమహారాజు తన తర్వాత రాజ్యాధికారాన్ని తీసుకునే పుత్ర సంతానం కోసం ప్రార్థించాడు. సరిగ్గా జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి రోజు శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ప్రార్థించగా..ఏడాది తిరిగేలోగా చైత్రమాస నవమి రోజు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడిగా దుష్టసంహారణార్థం అయోధ్యలో జన్మించాడు. ప్రతి అవతారంలోనూ స్వాని వెన్నంటే ఉండే ఆదిశేషుడు లక్ష్మణుడిగా జన్మించాడు. అప్పటి నుంచి జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. పిల్లలు లేని వారు సంతానం కోసం, సంతానం ఉన్నవారు వారి ఉన్నతి కోసం రామలక్ష్మణ ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ఈ వ్రతాన్ని వశిష్టమహర్షి దశరథుడికి సూచించాడు. ఈ రోజు వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతుంటాయి. స్వామివారికి షోడసోపచార పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు భక్తిశ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించి నెయ్యి దానేం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ వ్రతంలో ఉపవాసం చాలా ముఖ్యమైనది.. ఏకాదశి రోజు ఏ నియమాలు పాటిస్తారో రామలక్ష్మణ ద్వాదశి రోజు కూడా అవే నియమాలు పాటించాలి. ఈ వ్రతాన్ని చేసే భక్తుల కోర్కెలు నెరవేరడంతో పాటూ విష్ణులోకానికి చేరుకుంటారని పండితులు చెబుతారు. 


Also Read: ఈ ఆలయంలో 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతీక - ప్రస్తుతం ఉన్న ఒక్క స్తంభం కూలిపోతే కలియుగాంతమే!


చంపక ద్వాదశి


దేశవ్యాప్తంగా రామలక్ష్మణ ద్వాదశిని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజునే ఒడిశాలో చంపకద్వాదశి అంటారు. ఈ పండుగ సందర్భంగా పూరీ జగన్నాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏటా ఆషాడంలో జగన్నాథుడి రథయాత్రకి జరుగుతుంటుంది..అందుకు ఆలయంలో రథాన్ని సిద్ధంచేసేపనిలో ఉంటారు.  


Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!