18 wittinesses:  చుట్టూ ఎవ్వరూ లేరు కదా..ఏం చేసినా పర్వాలేదులే అనుకుంటున్నారేమో...మీకు తెలియకుండా మీ చుట్టూ ఉంటూ..మౌనంగా  మిమ్మల్ని గమనించే 18 సాక్షులున్నాయి. వాటినే అష్టాదశ సాక్షులు అంటారు.. 


అష్టాదశ సాక్షులు ఇవే
4 వేదాలు - ‎ఋగ్వేదం ,సామవేదం, ‎అథర్వణ వేదం, ‎యజుర్వేదం 
పంచభూతాలు - భూమి, నీరు,  గాలి, అగ్ని, ఆకాశం
10. అంతరాత్మ, 11. ధర్మం 12. సూర్యోదయం 13. సూర్యాస్తమయం 14. సూర్యుడు 15. చంద్రుడు 16.పగలు 17. రాత్రి 18. యముడు 
 
ఇవన్నీ ప్రతి జీవిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. వీటినుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యంకాదు. ప్రతి చర్యను నమోదు చేసి వాటిని విధిలోకి చేరుస్తాయి. మంచి పనులును సత్కర్మలుగా...చెడు పనులను దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. వాటి ఫలితాలు కూడా కొన్ని ఇదే జన్మలో అనుభవిస్తే మరికొన్ని కర్మలను మరుజన్మలో అనుభవించకతప్పదు...


Also Read: భర్త మనసు దోచుకునేందుకు ద్రౌపది సత్యభామకి చెప్పిన సూత్రాలివే - ఈ తరం మహిళలూ ఆచరించొచ్చు!


కర్మలు 3 రకాలు


ఆగామి కర్మలు 


ప్రస్తుతం మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి..వీటి ఫలితం వెంటనే ఉండొచ్చు లేదంటే తర్వాతకాలంలో ఉండొచ్చు. ఆకలివేస్తే భోజనం చేయడం, దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా ఆగామి కర్మలే..అయితే భోజనం చేసినవెంటనే కడుపునిండుతుంది... దాన ధర్మాల ఫలం తర్వాత రోజుల్లో వస్తుంది... 


సంచిత కర్మలు 


సంచిత కర్మలంటే కన్నవారి నుంచి ప్రాప్తించిన కర్మలు. అంటే గత జన్మలో అనుభవించకుండా వదిలేసిన ఆగామి కర్మలే ఈ జన్మలో సంచిత కర్మలవుతాయి. ఓ జన్మ నుంచి మరో జన్మలోకి రవాణా అవుతాయి. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా కర్మ మాత్రం వెంటాడుతుంది. 
 
ప్రారబ్ధ కర్మలు


సంచిత కర్మలు జన్మజన్మలు వెంటాడి అవి ముదిరితే ప్రారబ్ధ కర్మలవుతాయి. అంటే చేసే ప్రతి పనికి ఫలితం ఎప్పుడో అప్పుడు అనుభవించక తప్పదు. ఆ కర్మలను అనుభవించేందుకు వీలుగా ఉండే తల్లిగర్భాన్ని ఎన్నుకుంటాడు జీవుడు. కర్మ ఫలం పూర్తయ్యేవరకూ బంధంలో ఉండి ఆ తర్వాత శరీరాన్ని వదిలేస్తాడు..


Also Read: ఈ ఆలయంలో 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతీక - ప్రస్తుతం ఉన్న ఒక్క స్తంభం కూలిపోతే కలియుగాంతమే!
 
అందుకే ఎవ్వరూ చూడడం లేదని తప్పుచేస్తే  18 మూగసాక్షులు అనుక్షణం నీడలా చూస్తూనేఉంటాయి. చేసిన తప్పుల నుంచి బయటపడేందుకు తప్పుడు సాక్ష్యాలు చూపించి న్యాయదేతను మోసం చేయొచ్చు కానీ అష్టాదశ సాక్షులనుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మీరు చేసే పని మంచిదా చెడ్డదా అని మీ అంతరాత్మే చెప్పేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆవేశం, కోపంలో విచక్షణ కోల్పోతారు. అందుకే మీరు చేస్తున్న పని మంచిది అని మీ అంతరాత్మకు తెలిసినప్పుడు మీరు మూగసాక్షులను భయపడాల్సిన అవసరంలేదు.  


పూజలు, యాగాలు, దైవ సందర్శనం ద్వారా ఆగామి కర్మల నుంచి విముక్తి లభిస్తుంది. పితృదేవతల ఆరాధన ద్వారా సంచిత కర్మల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రారబ్ధ కర్మల నుంచి తప్పించుకునే మార్గాలు లేవు..వాటిని అనుభవించి తీరాల్సిందే. అందుకే ఈ జన్మలో దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు నిర్వహించడం వల్ల చాలా కర్మల నుంచి విముక్తి లభిస్తుందంటారు.  


Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!