Nirai Mata Temple in Chhattisgarh : నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా వెలిగే ఆలయాలు కొన్నైతే..ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే తెరిచి ఉండే ఆలయాలు మరికొన్ని.. శబరిమల, ఛార్ ధామ్  ఈ కోవకే చెందుతాయి. అయితే ఓ ఆలయం మాత్రం ఏడాదిలో కేవలం ఐదు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఐదు గంటల తర్వాత గుడి తలుపులు మూసేస్తారు. మళ్లీ అమ్మవారి దర్శనం కావాలంటే సంవత్సరం ఆగాల్సిందే.. అదే నీరయ్ మాతా దేవాలయం.


ఏడాదిలో 5 గంటలు మాత్రమే

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉంది నీరయ్‌ మాతా దేవాలయం. ఈ ఆలయంలోని నీరయ్‌ మాతా కేవలం చైత్ర నవరాత్రి ( అంటే ఉగాది ఉత్సవాల సమయంలో) రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు భక్తులకు దర్శనం ఇస్తుంది. ఆ రోజు వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి పొటెత్తుతారు. 

 


 

మహిళలకు ప్రవేశం లేదు

సాధారణంగా అన్నీ దేవాలయాల్లో అర్చనలకు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకరణ వస్తువులేవి ఇక్కడ ఉపయోగించరట. కేవలం కొబ్బరికాయ కొట్టి.. అగరబత్తులు వెలిగిస్తే చాలు అమ్మకు పూజచేసినట్టే. ఆ ఐదు గంటలు దాటిన తర్వాత ఆలయంలోకి భక్తులను అనుమతించరు. తిరిగి మరుసటి ఏడాది చైత్ర  నవరాత్రి వచ్చేవరకూ ఆలయంలోకి ఎవరూ రాకూడదనే నిబంధన ఉంది. అంతేకాదు..ఈ గుడిలోకి మహిళల ప్రవేశంపై కూడా నిషేధం ఉంది. ఈ నిషిద్ధం ప్రవేశం వరకూ మాత్రమే కాదు చివరకి అమ్మవారి ప్రసాదం కూడా మహిళలు తినకూడదట..కాదు కూడదనితింటే జీవితంలో ఏదో చెడు జరుగుతుందని అక్కడి వారి నమ్మకం

 


 

ఎన్నో మిస్టరీలు

చైత్ర నవరాత్రుల ప్రారంభంలో నీరయ్‌ మాతా ఆలయంలోని దీపం దానికదే వెలుగుతుందట. నూనె లేకున్నా.. తొమ్మిది రోజులపాటు దీపం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటుందని స్థానికులు చెబుతారు. అది ఎలా వెలుగుతోందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. అంతేకాదు...ఏడాదిలో 5 గంటలు మాత్రమే ఎందుకు తెరుస్తారు, మహిళలను ఎందుకు అనుమతించరు అన్నది ఇప్పటికీ ఎవ్వరూ చెప్పలేరు. తరతరాలుగా పాటిస్తున్నారు తాముకూడా పాటిస్తున్నామనే సమాధానం తప్ప నీరయ్ మాత గురించి మరే విషయం అక్కడివారు చెప్పలేరు. 

 

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్ 


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి