Hop shoots Farming: హాప్ రెమ్మలు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కూరగాయలలో ఒకటి అని మీకు తెలుసా? ఇది ఔషధ గుణాలు ఉన్న పువ్వు. దీనిని ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. దీనికి చాలా ఔషధ లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. 


ఇతర కూరగాయల కంటే చాలా భిన్నంగా ఉండే హోప్‌ షూట్‌ చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది. హాప్ షూట్ల పెంపకం భారతదేశంలో చాలా మంది ప్రయత్నించారు కానీ పండించలేకపోయారు. ఇది ఒక ఉష్ణమండలంలో పెరిగే మొక్క. దీనిని ఉత్తర అమెరికా, యురేషియా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో మాత్రమే పెంచవచ్చు. అక్కడి రైతులు దీనిని పెద్ద ఎత్తున సాగు చేస్తారు. ఈ పంట కిలో రూ.85,000 నుంచి రూ.1 లక్ష ధరకు అమ్ముడవుతుంది. 


హాప్ షూట్ పెంపకానికి ఉష్ణమండల వాతావరణం తప్పనిసరి కావాలి. అందుకే భారతదేశంలో ఈ పంట పండే హోప్‌ లేదు. అయినప్పటికీ చాలా మంది హాప్ రెమ్మలను పెంచడానికి ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. ఈ కూరగాయ రుచి చేదుగా ఉంటుంది. ఇది దాని ఔషధ లక్షణాలను సూచిస్తుంది.


చాలా మంది హాప్ రెమ్మలను పచ్చిగా తినడానికి కూడా ఇష్టపడతారు. ఈ కూరగాయల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ రైతు అయినా మంచి డబ్బు సంపాదించగలడు. కానీ బ్రిటన్‌ లాంటి దేశాల్లో ఆర్థిక మాంద్యం కారణంగా ఈ కాయగూర కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. 


వాస్తవానికి, హాప్ కొమ్మలు, పువ్వులను తినడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క 3 సంవత్సరాల నుంచి కాపునకు వస్తుంది. అప్పుడే దీని కొమ్మలు, పువ్వులు విక్రయిస్తారు రైతులు. అప్పటి వరకు దీన్ని చాలా సురక్షితంగా చూసుకోవాల్సి ఉంటుంది. చీడపీడల త్వరగా ప్రభావం చూపిస్తాయి. 


ఈ పంటను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు, కోత కోయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. దీనికి చాలా దేశాలలో కూడా డిమాండ్ ఉంది. దీని ధర ఎక్కువగా ఉండటానికి ఆ డిమాండే కారణం. ఈ మొక్కలు పొదలు మాదిరి గుబురుగా పెరుగుతాయి. అందుకే దీన్ని జాగ్రత్తగా కోయాల్సి ఉంటుంది. 


హాప్ రెమ్మల నుంచి పువ్వులు వేరు చేసిన తర్వాత కూడా ఆ మిగిలిన భాగానికి మంచి డిమాండ్ ఉంది. హాప్ షూట్స్ ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి తగ్గించి ఉత్సాహాన్ని ఇస్తుంది. అటెన్షన్ డెఫిసిట్-హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్(ADHD), చిరాకు మొదలైన వాటిని కూడా పరిష్కరించగలవని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఇది క్యాన్సర్ కణాలు, లుకేమియా కణాలను నివారించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.




Disclaimer: మీడియా రిపోర్టుల ఆధారంగా వార్తలో సమాచారాన్ని అందిస్తున్నాం. రైతు సోదరులు ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించితే మంచిది.