‘న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌’ అంటే తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదని అర్థం. గాయత్రి మంత్రం గురించి ఋగ్వేదంలో  వివరించారు. గాయత్రి అనే పదం ‘గయ’ ‘త్రాయతి’ అను పదాలతో కూడుకుని ఉంది.‘గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ’ అని ఆదిశంకరాచార్యులు వివరించారు.


గాయత్రీ మంత్రం
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, 
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”


ఈ మంత్రాన్ని పూర్వకాలంలో కొన్ని వర్ణాల వారు వేద పాఠశాలలో మాత్రమే నిర్దిష్టమైన పద్దతిలో జపించేవారు. కానీ కాలక్రమేణా విజ్ఞాన ఫలాల అందుబాటులోకి రావడం వల్ల గాయత్రి మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి. అనేక విధాలుగా గాయత్రి స్తోత్రం చేస్తారు. వీటిలో నవగ్రహ గాయత్రి కూడా ఒకటి. ఈ మంత్రం జపించడం వల్ల నవగ్రహ దోషాలు తొలగి శుభం జరుగుతుందని పండితులు చెబుతారు.


Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది


నవగ్రహ గాయత్రి
1.సూర్య గాయత్రి
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే 
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్


2.చంద్ర గాయత్రి
ఓం అమృతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహే
తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.


3.కుజ గాయత్రి
ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే
తన్నో: కుజః ప్రచోదయాత్.


4.బుధ గాయత్రి
ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహే 
తన్నో బుధః ప్రచోదయాత్


5.గురు గాయత్రి
ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహే 
తన్నో గురుః ప్రచోదయాత్


6.శుక్ర గాయత్రి
ఓం భృగువాస జాతాయ విద్మహే శ్వేతవాహనాయ ధీమహే
 తన్నో శుక్రః ప్రచోదయాత్


7.శని గాయత్రి
ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహే
 తన్నో శనిః ప్రచోదయాత్


8.రాహు గాయత్రి
ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పందాయ ధీమహే
తన్నో రాహుః ప్రచోదయాత్


9.కేతు గాయత్రి
ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహే
తన్నో కేతుః ప్రచోదయాత్


24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే చాలు, సర్వ పాపాలు హరించి,సకల దోషాలు తొలగి పోతాయంటారు. 


నవగ్రహ శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||


Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే