Nagula Chavithi 2024 Puja Muhurat Time: దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి జరుపుకుంటారు. కొందరు ఈ పండుగను శ్రావణమాసంలో జరుపుకుంటారు.. కొన్ని ప్రాంతాలవారు కార్తీకమాసంలో జరుపుకుంటారు. పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాధలున్నాయి. దేశవ్యాప్తంగా ఆలయాల్లో నాగేంద్రుడి ప్రతిమలు కనిపిస్తుంటాయి. నాగుల చవితి,నాగుల పంచమి రోజు నాగేంద్రుడిని ఆరాధిస్తే సకల రోగాలు తొలగిపోయి ఆరోగ్యంవంతులం అవుతారమని భక్తుల విశ్వాసం. పుట్టతో పోల్చే మనిషి శరీరానికి తొమ్మిది రంధ్రాలుంటాయి.. వీటినే నవరంధ్రాల అంటారు. నాడులతో నిండిన వెన్నుముకను వెన్నుపాముఅంటారు... కుండలినీ శక్తి మూలాధారచక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. ఇది మనిషిలో నిద్రను నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాన్ని కక్కుతూ...మనిషిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తుంది. అందుకే నాగుచవితి రోజు విష సర్పాన్ని ఆరాధించడం ద్వారా మనిషిలో విషసర్పం శ్వేతత్వం పొందుతుందని పండితులు చెబుతారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు... పుట్టలో పాలుపోస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటారు.
Also Read: పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!
తిథులు తగులు, మిగులు ( ముందురోజు మర్నాడు) వస్తే నాగుల చవితి ఏ రోజు జరుపుకోవాలో అనే కన్ప్యూజన్ నెలకొంటుంది. కానీ ఈ ఏడాది అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నవంబరు 5 మంగళవారం రోజు చవితి తిథి రోజంతా ఉంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ చవితి ఉండడంతో..ఈ సమయంలో అయినా పాలుపోయొచ్చు. కేవలం వర్జ్యం,దుర్ముహూర్తం లేకుండా చూసుకోవాలి.
నవంబరు 04 సోమవారం రాత్రి 8 గంటల 53 నిముషాలకు చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి
నవంబరు 05 మంగళవారం రాత్రి 9 గంటల 25 నిముషాల వరకూ చవితి ఉంది... అంటే మంగళవారం రోజు రోజంతా చవితి ఘడియలు ఉన్నాయి. అందుకే ఎలాంటి గందరగోళం లేకుండా నవంబరు 05 మంగళవారమే నాగులచవితి...
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!
రోజంతా చవితి ఘడియలు ఉన్నాయి కాబట్టి ఆ కేవలం వర్జ్యం,దుర్ముహూర్తాలు లేకుండా చూసుకుని పాలు పోస్తే సరిపోతుంది.
దుర్ముహూర్తం
నవంబరు 05 మంగళవారం ఉదయం 8.21 నుంచి 9.06 వరకు...తిరిగి...రాత్రి 10.25 నుంచి 11.26 వరకూ ఉంది
వర్జ్యం
నవంబరు 05 మంగళవారం సాయంత్రం 4.30 ముంచి 6.15 వరకూ వర్జ్యం ఉంది... అంటే ఉదయం సమయంలో వర్జ్యం లేదు.. కేవలం దుర్ముహూర్తం టైమ్ మినిహాయించి ఏ సమయంలో అయినా పాలు పోయొచ్చు.
పుట్ట దగ్గర చదువుకునే శ్లోకాలివే
నన్నేలు నాగన్న , నాకులమునేలు
నాకన్నవారల నాఇంటివారనేలు
ఆప్తమిత్రులనందరిని ఏలు
పడగ తొక్కిన పగవాడనుకోకు
నడుము తొక్కిన నావాడనుకో
తోక తొక్కితే తొలిగిపో వెళ్లిపో
ఇదిగో ! నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇవ్వు
అని పుట్టలో పాలు పోస్తూ నూక వేసి వేడుకుంటారు
ప్రార్థన
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
నాగులచవితిరోజున ఈ శ్లోకం పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది
"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||
Also Read: కార్తీక మాసంలో ఆలయాల సందర్శనకు ఐఆర్‌టీసీ ప్రత్యేక ట్రైన్- దివ్య దక్షిణ్ యాత్ర పేరిట 9 రోజుల టూర్