Margashira Laxmi Pooja Vidhanam: మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అత్యంత ప్రత్యేకం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవి పూజ నియమాలు పాటించి ఆచరిస్తే ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు.
డిసెంబరు 5 మార్గశిరమాసం మొదటి గురువారం. ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి సమర్పించాల్సిన నైవేద్యం పరమాన్నం, పులగం
మార్గశిర గురువారం పాటించాల్సిన నియమాలు
సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రంచేసి దేవుడి మందిరాన్ని సిద్ధం చేసుకోవాలి.
మార్గశిరంలో ఈ నెల రోజులు గురువారం రోజుల్లో తలకు నూనె రాసుకోవడం, చిక్కులు తీసుకోవడం చేయరాదు. షాంపు వినియోగించకుండా తలకు స్నానం ఆచరించండి.
బియ్యంపిండితో ముగ్గువేసిన తర్వాత.. పూజా సామగ్రి అంతా సర్దుకోండి ఏ పూజ ప్రారంభించినా ముందుగా గణపతి పూజ చేయాలి.. ( గణపతి పూజ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వినాయక పూజ తర్వాత శ్రీ మహాలక్ష్మికి కూడా షోడసోపచార పూజ పూర్తిచేయాలి. ఈ విధానం తెలియదు అనుకున్నవారు శ్రీ మహాలక్షి అష్టోత్తరం చదువుకుంటూ ...పసుపు, కుంకుమ, పూలు, అక్షతలతో అమ్మవారికి పూజ చేయండి. అనంతరం దీపానికి నమస్కరించి, ధూపం వెలిగించి, నైవేద్యం సమర్పించి..తాంబూలం ఇచ్చి...నీరాజనం వెలిగించండి.
ఇంకాసేపు భగవంతుడి సన్నిధిలో ఉండాలి అనుకుంటే లక్ష్మీ అష్టోత్తరంతో పాటూ మహాలక్ష్మీ అష్టకం , కనకధారా స్తోత్రం చదువుకోండి
Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహిత ప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః 10
ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
20
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కన్తాయై నమః
ఓం క్షమాయై నమః
ఓం క్షీరోదసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః 30
ఓం ఋద్దయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
40
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః 50
ఓం పద్మిన్యై నమః
ఓం పుణ్య గంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
60
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాద జనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్టయే నమః 70
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతీపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
80
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః 90
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్స్థల నమః
ఓం స్థితాయై నమః
ఓం విష్ణుపత్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
100
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
108
ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తర శతనామావళి సమాప్తమ్.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!