Margasira Guruvaram Vrathm: మార్గశిర మాసంలో ప్రతి గురువారం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంత ముఖ్యమో మార్గశిరమాసంలో వచ్చే గురువారాలకు అంతే విశిష్ఠత ఉంది. ఈ రోజు తలకు స్నానం ఆచరించి భగవంతుడి సన్నిధిని శుభ్రం చేసుకుని...పూజా సామగ్రి సిద్ధంచేసుకుని భక్తిశ్రద్ధలతో శ్రీ సూక్త విధానంలో అమ్మవారి పూజ చేయాలి. పూజా విధానం మొత్తం తెలియదు అనుకుంటే దీపం వెలిగింది గణపతికి నమస్కరించి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించాలి. అనంతరం మార్గశిర గురువారం కథ చదువుకుని అక్షతలు తలపై వేసుకోవాలి.


దీపం, ధూపం, నైవేద్యానికి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత..ముందుగా గణపతి పూజ చేయాలి
 
 ( గణపతి పూజ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


అనంతరం శ్రీ సూక్త విధానంలో శ్రీ మహాలక్ష్మికి షోడసోపచార పూజ చేయాలి ( మొత్తం 16 ఉపచారాలు)


డిసెంబరు 12 గురువారం మార్గశిర మాసం రెండో వారం - ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి మినుగులు, బియ్యం  అట్లు-  బియ్యంపిండి , బెల్లంతో తయారు చేసిన తిమ్మనం ( పాలారతి) నైవేద్యంగా సమర్పించాలి


అట్లు (దోశ) వేసుకోవడం అందరకీ తెలుసు... ఇక తిమ్మనం తయారీ ఇక్కడ తెలుసుకోండి..
 
తిమ్మనం(పాలారతి)తయారీ


తిమ్మనం తయారీ కోసం ప్రత్యేకంగా ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాసేపు నానబెట్టిన బియ్యం, బెల్లం, పాలు, కొబ్బరి తురుము ఉంటే పావుగంటలో రెడీ అయిపోతుంది..చిన్న కప్పుతో బియ్యం నానబెట్టుకోవాలి.. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. అనంతరం పాలు మరిగించి బియ్యం పిండి, తురిమిన కొబ్బరి వేసి ఉడికించాలి. మూతపెట్టి వదలేయకూడదు..ఉండలుగా మారిపోతుంది. పాలలో వేసిన బియ్యం, కొబ్బరితురుమును కలుపుతూ ఉండాలి. అది పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లం లేదా పంచదార వేయాలి. పాయసంలో యాడ్ చేసినట్టే యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.


Also Read: మార్గశిర గురువారం వ్రతంలో భాగంగా తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇదే!


శ్రీ సూక్తం


 ఓం || హిర’ణ్యవర్ణాం హరిణీం సువర్ణ’రజతస్రజామ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||


తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షానహమ్ ||


అశ్వపూర్వాం ర’థమధ్యాం హస్తినా”ద-ప్రబోధి’నీమ్ |
శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ ||


కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం తర్పయం’తీమ్ |
పద్మే స్థితాం పద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||


చంద్రాం ప్ర’భాసాం యశసా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శర’ణమహం ప్రపద్యే ‌உలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృణే ||


ఆదిత్యవ’ర్ణే తపసో ‌உధి’జాతో వనస్పతిస్తవ’ వృక్షో ‌உథ బిల్వః |
తస్య ఫలా’ని తపసాను’దంతు మాయాంత’రాయాశ్చ’ బాహ్యా అ’లక్ష్మీః ||


ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి’నా సహ |
ప్రాదుర్భూతో ‌உస్మి’ రాష్ట్రే ‌உస్మిన్ కీర్తిమృ’ద్ధిం దదాదు’ మే ||


క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’లక్షీం నా’శయామ్యహమ్ |
అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ ||


గంధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్‍మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||


మన’సః కామమాకూతిం వాచః సత్యమ’శీమహి |
పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ ||


కర్దమే’న ప్ర’జాభూతా మయి సంభ’వ కర్దమ |
శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ ||


ఆపః’ సృజంతు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే |
నిచ దేవీం మాతరం శ్రియం’ వాసయ’ మే కులే ||


ఆర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||


ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||


తాం మ ఆవ’హ జాత’వేదో లక్షీమన’పగామినీ”మ్ |
యస్యాం హిరణ్యం ప్రభూ’తం గావో’ దాస్యో ‌శ్వా”న్, విందేయం పురుషానహమ్ ||


ఓం మహాదేవ్యై చ’విద్మహే విష్ణుపత్నీ చధీమహి | తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్ ||


శ్రీర్వర్చ’స్వమాయు’ష్యమారో”గ్యమావీ’ధాత్ పవ’మానం మహీయతే” | 
ధాన్యం ధనం పశుం బహుపు’త్రలాభం శతసం”వత్సరం దీర్ఘమాయుః’ ||


ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||