Shanidev Along With Sun God This Year


నెలకో రాశిలో సంచరించే ఆదిత్యుడు ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశించే సమయమే మకర సంక్రాంతి
మకర రాశికి అధిపతి శని భగవానుడు
శని సాక్షాత్తూ ప్రత్యక్షనారాయణుడైన సూర్యుడి తనయుడు
అందుకే శనిప్రభావం ఉన్నవారు సంక్రాంతి సందర్భంగా కొన్ని నియమాలు అనుసరిస్తే శనిబాధల నుంచి ఉపశమం లభిస్తుందంటారు పండితులు. 
 
సూర్యుడు ఉత్తరాయణంవైపు మళ్లే సమయంలో తన కుమారుడైన శనితో కలసి నెలరోజులు ఉంటాడని..ఆ సమయంలో సూర్య తేజస్సు ముందు శని ప్రభావం మసకబారుతుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..ఇలాంటి సమయంలో శనిని ప్రశన్నం చేసుకుంటే వివిధ రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటారు


సంక్రాంతి రోజు తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్యుడికి శనిదేవుడు నల్లనువ్వులతో స్వాగతం పలికాడట. అందుకే ఈ రోజు వేకువజామునే స్నానం చేసి సూర్యుడికి నల్లనువ్వులు సమర్పిస్తారు. ఈ రోజు ఆదిత్యుడికి  నల్ల నువ్వులు సమర్పిస్తే శని బాధలు ఉండవని చెబుతారు... సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో వర్థిల్లుతారు. అందుకే మకర సంక్రాంతి రోజు సూర్యుడికి చేసే పూజలో నల్ల నువ్వులు ఉపయోగిస్తారు. ఈ రోజు నల్ల నువ్వులతో సూర్యుడిని పూజించడమే కాదు..వాటిని దానంగా ఇస్తే శనిబాధలు తొలగిపోతాయి.  


 మిగిలిన రోజుల్లో కన్నా మకర సంక్రాంతి రోజు చేసే దానం, పూజకు ఎన్నో రెట్లు ఫలితం ఉంటుంది. అందుకే సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి నల్లనువ్వులు కలిపిన నీటిని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. పూజ పూర్తైన తర్వాత  ఆవనూనె, నల్ల నువ్వులు, నువ్వుల లడ్డూ.. దానంగా ఇస్తే శని ప్రభావం చాలా తగ్గుతుంది.


Also Read: భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
 
శని దోషం ఉన్నట్టు ఎలా తెలుస్తుంది?


శని..మీ రాశి నుంచి  12,1,2 స్థానాల్లో సంచారిస్తే ఏలినాటి శని అంటారు


జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తే అర్ధాష్టమ శని, అష్టమ శని, దశమ శని అంటారు 


శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు చేపట్టిని పనుల్లో ఇబ్బందులు, వ్యాపారంలో - ఉద్యోగంలో-వ్యక్తిగత జీవితంలో ఒడిదొడికులు ఉంటాయి. నిత్యం అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.


శని ఒకటో స్థానంలో సంచరిస్తే అనారోగ్యం, నిందలు, జీవిత భాగస్వామితో వివాదాలు తప్పవు...మనశ్సాంతి ఉండదు. అనుకోని ఖర్చులుంటాయి. 


Also Read: భోగి రోజు భగవంతుడిని పెళ్లి చేసుకున్న భక్తురాలు.. ఈ ప్రేమకథ చాలా ప్రత్యేకం!


శని రెండో స్థానంలో ఉంటే అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అనుకున్న సమయానికి ఏదీ పూర్తికాదు. ఆశపెట్టి నిరాశ కల్పిస్తాడు. మానసిక ఆందోళన తప్పదు


మీ రాశి నుంచి నాలుగో స్థానంలో సంచరిస్తే అది అర్ధాష్టమ శని..ఈ ప్రభావం రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులపై ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ పెద్దలకు అనారోగ్యం, వాహనప్రమాదాలు ఉంటాయి


మీ రాశి నుంచి 8వ స్థానంలో శని ఉంటే దాన్ని అష్టమశని అంటారు.  ఈ సమయంలో ఉద్యోగం, వ్యాపారంలో ఆటంకాలుంటాయి. అశాంతి తప్పదు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. శత్రుభయం ఉంటుంది. 


జన్మరాశి నుంచి 10స్థానంలో శని సంచారాన్ని కంటక శని అంటారు. ఈ సమయంలో కోర్టు కేసులు, అవమానాలు, అందరితో విభేదాలు ఉంటాయి 
 
ఈ అన్నిరకాల శని దోషాల నుంచి విముక్తి లభించాలంటే..సంక్రాంతి రోజు పైన పేర్కొన్నవాటిని అనుసరించండి.  


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం


Also Read: భోగ భాగ్యాలనిచ్చే భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!