Bhogi Wishes in Telugu 2025: తెలుగువారు వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. జనవరి 13 సోమవారం భోగితో  మొదలయ్యే ఈ పండుగ జనవరి 14 సంక్రాంతి, జనవరి 15 కనుమ వరకూ మూడు రోజులు సందడిగా సాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజు  ముక్కనుమ అంటూ జరుపుకుంటారు. భోగిమంటల్లో పాత వస్తువులు వేసేసి మనసులో చెడును మసి చేసి మంచి పెంచుకోవడమే భోగి మంటల వెనుకున్న ఆంతర్యం. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు భోగ భాగ్యాల భోగి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.


భోగ భాగ్యాల భోగి..సరదాల సంక్రాంతి..కమ్మనైన కనుమ..
మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు @2025


మిమ్మల్ని వెంటాడిన కష్టాలన్నీ భోగి మంటల్లో మసైపోవాలి
కొత్త ఆనందాలు మీ జీవితంలో వెల్లివిరియాలి
మీ ఇంటిల్లిపాదికి భోగి శుభాకాంక్షలు


మీ జీవితంలో ఉండే చీడ తొలగిపోవాలి
నూతన వెలుగులు నిండాలి
సంతోషంగా ఉండాలి ఎప్పటికీ
భోగి పండగ శుభాకాంక్షలు!


ఈ భోగి మీకు అన్ని భాగ్యాలను అందించాలి
మీకు, మీ కుటుంబసభ్యులకు భోగి శుభాకాంక్షలు


మీలోని చెడును, వ్యసనాలను భోగి మంటల్లో పడేయండి
మీ జీవితంలోకి కొత్త వెలుగులకు ఆహ్వానం పలకండి
భోగి 2025 శుభాకాంక్షలు!


గడిచిన రోజులు వదిలేయండి
రేపటికి ఘనంగా స్వాగతం పలకండి
చీకట్లను తరిమేసే భోగిమంటల్లా మీ జీవితంలో వెలుగు రావాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు


రంగు రంగుల గాలిపటాలు ఆకాశంలో ఆనందంగా ఎగురుతున్నట్టు
ఈ భోగి పండుగ మీ జీవితంలో సరికొత్త ఆనందాలు తేవాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు


Also Read: 600 కోట్ల ఖర్చు.. 7జన్మలకు గుర్తుగా 7ద్వారాలు.. మిల్లు కార్మికుడి కొడుకు కట్టిన అద్భుతమైన స్వర్ణ దేవాలయం!


భోగి మంటల్లో మీ సమస్యలు మాడిమసైపోవాలి
మీ ఇంట సౌభాగ్యం, సంతోషం, భాగ్యం ఉండాలి
అందరకీ భోగి శుభాకాంక్షలు


చెడును దహించే భోగి మంటలు 
భోగాలను అందించే భోగి పళ్లు
ఘుమఘుమలాడే పిండి వంటలు 
అడుగడుగునా సందడే
భోగి@2025, సంక్రాంతి @ 2025 శుభాకాంక్షలు


ఈ భోగి భోగభాగ్యాలతోపాటు మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలి
ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ
అందరికీ భోగి శుభాకాంక్షలు.


భోగి మంటల వెచ్చని వెలుగులు..రంగవల్లుల్లో గొబ్బిళ్లు..
కొత్త బియ్యపు పొంగళ్లు..అందరి మది ఆనందంతో పరవళ్లు..
పెద్ద పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు


తెలుగుదనానికి తలమానికంగా నిలిచే ప్రతి ఇల్లు..
కుటుంబాలను దగ్గరకి చేర్చే మూడు రోజులు.. 
మీ జీవితాల్లో మరిన్ని మధురానుభూతులు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు.


నింగిని తాకే పతంగులు..ఆనందాన్ని పెంచే కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు..సంక్రాంతి మూడు దినాలు..
చూడతరమా పల్లె అందాలు
భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు


ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలి 
మీ కష్టాలన్నీ దహించి వేయాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు 


ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రాంతి
జీవులకు వెలుగునిచ్చె  రవికిరణాలు
భోగభాగ్యాల భోగి.. సంతోషాల సంక్రాంతి.. కమ్మనైన కనుమ
ఈ ఇంట సంతోషం వెల్లివిరియాలి
భోగి - సంక్రాంతి శుభాకాంక్షలు!


కొత్త అల్లుళ్లకు స్వాగతం పలికుతూ తోరణాలు
ధాన్యపు రాసులతో నిండిన గోదాములు
వాకిలిలో అందమైన రంగలవల్లులు
చెడును దహించేసే భోగి మంటలు
సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇల్లు
 భోగి , సంక్రాంతి శుభాకాంక్షలు


Also Read:  దశావతారాల్లో ఏడు అవతార ఆలయాలు ఏపీలోనే ఉన్నాయ్.. ఎక్కడున్నాయ్ , మీరెన్ని దర్శించుకున్నారు!