విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సుపై గంగను ధిరించినా గంగాధరుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. అందుకే శివార్చనలో ముఖ్యమైనది అభిషేకమే. అయితే అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత, పరమార్థం ఉంది. అవేంటంటే ...


ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం
ఆవు పాలు  - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు
ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి  - ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది
తేనె  - తేజస్సు వృద్ధి చెందుతుంది
భస్మ జలం  - పాపాలు నశిస్తాయి 
సుగంధోదకం - పుత్ర లాభం
పుష్పోదకం  - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు
బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి
నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది
రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది
సువర్ణ జలం - దరిద్ర నాశనం
అన్నాభిషేకం  - సుఖ జీవనం
ద్రాక్ష రసం  - సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం  - సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం  - శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి 
ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు
గంగోదకం  - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం
నేరేడు పండ్ల రసం  - వైరాగ్యం 
నవరత్న జలం - గృహ ప్రాప్తి
మామిడి పండు రసం - దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి
పసుపు, కుంకుమ - మంగళ ప్రదం
విభూది  - కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.


Also Read: శివుడుని 'లయకారుడు' అని ఎందుకంటారు
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే


శివాష్టకం
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథనాథం సదానందభాజామ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభుమీశానమీడే || 1 ||


గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాలకాలం గణేశాదిపాలమ్ |
జటాజూటగంగోత్తరంగైర్విశాలం
శివం శంకరం శంభుమీశానమీడే || 2 ||


ముదామాకరం మండనం మండయంతం
మహామండలం భస్మభూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహామోహమారం
శివం శంకరం శంభుమీశానమీడే || 3 ||


వటాధోనివాసం మహాట్టాట్టహాసం
మహాపాపనాశం సదాసుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం
శివం శంకరం శంభుమీశానమీడే || 4 ||


గిరింద్రాత్మజాసంగృహీతార్ధదేహం
గిరౌసంస్థితం సర్వదా పన్నగేహమ్ |
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం
శివం శంకరం శంభుమీశానమీడే || 5 ||


కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
బలీవర్దయానం సురాణాం ప్రధానం
శివం శంకరం శంభుమీశానమీడే || 6 ||


శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణాకళత్రం సదాసచ్చరిత్రం
శివం శంకరం శంభుమీశానమీడే || 7 ||


హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారమ్ |
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే || 8 ||


స్తవం యః ప్రభాతే నరశ్శూలపాణేః
పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ |
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం
విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి || 9 ||