Mahabharat: కౌరవులు-పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం గురించి ఇప్పటికీ మనకు తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి. మహాభారత యుద్ధానికి సంబంధించిన ఇలాంటి రహస్యాలు దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. వరుసగా 18 రోజుల పాటు సాగిన ఈ మహా యుద్ధంలో 18 మంది సైనికులు మాత్రమే సజీవంగా మిగిలారు. మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించారని చాలా మందికి తెలుసు. కౌరవులందరూ హ‌త‌మ‌య్యార‌ని మీరు కూడా అనుకుంటే అది ఖచ్చితంగా తప్పు. ఎందుకొ మీకు తెలుసా?


ఈ మహాయుద్ధం తర్వాత కూడా దుర్యోధనుడి సోదరుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. నిజానికి కౌరవుల బదులు పాండవుల పక్షాన అత‌ను కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. ఈ కౌరవ యోధుడు ఎవరో తెలుసా? పాండవుల తరపున పోరాడటానికి కారణం ఏమిటి..? మరి అతని బాధ్యత ఏమిటో తెలుసా..?


Also Read: సమాజంలో కీర్తి, గౌరవం కోసం ఈ పనులు చేయాలి


1. ఆ కౌరవ వీరుడు ఎవరు..?


మహాభారత యుద్ధంలో దుర్యోధనుడితో సహా 100 మంది కౌరవులు వీర మ‌ర‌ణాన్ని సాధించారు. ఐదుగురు పాండవులు, శ్రీ కృష్ణుడు తప్ప, అతని పక్షాన ఉన్న యోధులందరూ కూడా వీర స్వ‌ర్గం పొందారు. యుద్ధం తరువాత, రెండు వైపుల నుంచి 18 మంది సైనికులు మాత్రమే ప్రాణాల‌తో బయటపడ్డారు. జీవించి ఉన్న ఒకే ఒక‌ కౌరవుడు యుయుత్సుడు. దృతరాష్ట్రుడు... సుఖద అనే ఓ చెలికత్తె ద్వారా బిడ్డను కంటాడు. ఆ బిడ్డ పేరే యుయుత్సుడు! అత‌న్ని తోటి కౌరవులు దాసీపుత్రునిగానే భావించేవారు. అయినా అది యుయుత్సుని వ్యక్తిత్వం మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సకల విద్యలూ నేర్చకుని, సకల ధర్మాలూ ఔపోసన పట్టి అతిరథ మహారథునిగా కీర్తిని గాంచాడు. అసలు యుయుత్సుడు అంటేనే పోరాటానికి సిద్ధంగా ఉండేవాడు అని అర్థం!


2. యుధిష్ఠిరుని ప్రకటన, యుయుత్సుని నిర్ణయం


కౌరవులు మహాభారత యుద్ధం ప్రకటించినప్పుడు, యుధిష్ఠిరుడు మొదటి రోజు ధర్మాన్ని రక్షించే యుద్ధంగా ప్రకటించాడు. పాండవులు అధర్మానికి వ్యతిరేకంగా ధర్మ విజయం కోసం పోరాడుతున్నారు. కౌరవ పక్షం నుంచి ఎవరైనా అధర్మానికి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే, త‌మ‌ సైన్యంలోకి స్వాగతం పలుకుతామని పాండవులు ప్రకటించారు. ఈ ప్రకటన కౌరవ సైన్యంలో నిలిచిన యుయుత్సుని ఆలోచనను మార్చింది. దీంతో అత‌ను పాండవుల తరపున పోరాడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే కౌరవ సైన్యాన్ని వదిలి పాండవ సైన్యంలో చేరాడు.


3. పాండవ సైన్యానికి యుయుత్సుడి సేవ


పాండవుల్లో అగ్ర‌జుడు ధ‌ర్మ‌రాజుకు యుయుత్సుని పరాక్రమం, వివేకం గురించి తెలుసు. అందుకే యుయుత్సుడిని నేరుగా యుద్ధానికి తీసుకురాలేదు. పాండవ సైన్యానికి ఆహారం, ఆయుధాలను ఏర్పాటు చేసే ప్రధాన బాధ్యతను యుయుత్సుడికి అప్పగించాడు. యుయుత్సుడు కూడా తనకు అప్పగించిన పనిని పూర్తి బాధ్యతతో నెరవేర్చి యుద్ధం ముగిసే వరకు పాండవ సైన్యానికి ఈ రెండు విషయాల్లో లోటు రాకుండా చూశాడు. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత, పాండవులు హస్తినాపురాన్ని స్వాధీనం చేసుకున్నారు. యుధిష్ఠిరుడు యుయుత్సుడిని మంత్రిగా చేసుకున్నాడు.


Also Read: శ్మశానాల్లోకి స్త్రీలు అడుగుపెడితే!


4. చివరి వరకు సంరక్షకుడు


హస్తినాపురం రాజు ధృతరాష్ట్రుడికి యుధిష్ఠిరునికి మేనమామ విదురుడు పోషించిన పాత్రను పనిమనిషి కుమారుడు యుయుత్సుడు పోషించాడు. యుధిష్ఠిరుడు పదవీ విరమణ చేసి స్వ‌ర్గారోహ‌ణ‌కు వెళ్లేముందు, అతను పరీక్షిత్తును రాజుగా చేశాడు. దీని తర్వాత పరీక్షిత్‌కు యోగ్యమైన గురువు కావాలి కాబట్టి యుయుత్సుడిని పరీక్షిత్‌కి సంరక్షకునిగా నియ‌మించాడు. యుయుత్సుడు తన జీవితపు చివరి క్షణం వరకు పూర్తి భక్తితో ఈ బాధ్యతను నిర్వర్తించాడు. ఇది మాత్రమే కాదు.. గాంధారి, ధృతరాష్ట్రుడు భయంకరమైన అడవి మంట‌ల్లో మరణించినప్పుడు, యుయుత్సుడే వారి అంత్యక్రియలు నిర్వ‌హించాడు.