మే 11 రాశిఫలాలు


మేష రాశి 
వైవాహిక జీవితం గడిపేవారికి ఈ రోజు సంతోషకరమైన రోజు. మీరు స్నేహితుడిపై కోపంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుల అవసరాలపై పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగులు పనివిషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు. అప్పులు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. 


వృషభ రాశి 
ఆర్థిక పరంగా మీకు బలమైన రోజు అవుతుంది. మీరు మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాత ప్రణాళికలు కొన్ని ఈ రోజు మీకు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులకు మీరు చేసిన వాగ్ధానం నెరవేర్చాలి. మీ పనిపై మీరు పూర్తి దృష్టి పెట్టాలి. అనుభవజ్ఞులతో సంప్రదింపులు జరిపి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది.


మిథున రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. బయటి వ్యక్తులతో వాగ్వాదం చేయకుండా ఉండడం మంచిది. తలపెట్టిన పనిని జాగ్రత్తగా పూర్తిచేయండి.  ఈ రోజు మీకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే దానిని సకాలంలో పూర్తి చేయాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. పిల్లలతో ఏదో విషయంలో చికాకు ఉంటుంది. 


Also Read: మే 8 నుంచి 14 వీక్లీ రాశిఫలాలు, ఈ 6 రాశులవారికి ఆర్థికలాభం, వ్యవహారజయం




కర్కాటక రాశి 



ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. వ్యాపారులు లాభాల కోసం వ్యూహాన్ని రూపొందిస్తారు.  తొందరపడి పెట్టుబడులు పెట్టొద్దు. ఉద్యోగుల పాత తప్పులు అధికారుల ముందుకొస్తాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే విద్యార్థులకు ఇది మంచి సమయం. ఈ రోజు ఆర్థిక పరంగా బలహీనంగా ఉంటుంది.మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.


సింహ రాశి
కెరీర్ గురించి ఆందోళన చెందుతున్న వారికి ఈ రోజు మంచిరోజు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. ఈ రోజు తోబుట్టువులతో జరుగుతున్న సమస్యలను పరిష్కరించుకోండి. మీరు మీ కుటుంబ అవసరాలపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. ప్రేమ జీవితం గడిపే వ్యక్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఉత్సుకతతో ఉంటారు. భాగస్వామ్యంతో పనిచేయడం మీకు మంచిది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు.


కన్యా రాశి  
సామాజిక రంగాల్లో పనిచేసే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త స్నేహితులను పొందుతారు.ఆస్తి కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబంలో ఏదైనా సమస్య చాలా కాలంగా వేధిస్తున్నట్లయితే ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు అడుగేయవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. 


తులా రాశి 
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. దేని గురించైనా ఆందోళన చెందితే అది కూడా ఈ రోజు పోతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి.        శుభవార్త వింటారు. విద్యార్థులు పరీక్షలో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఈ రోజు మీకు న్యాయపరమైన విషయాలలో అనుభవజ్ఞుల సలహా అవసరం అవుతుంది. లావాదేవీకి సంబంధించిన ఏ విషయాన్ని అయినా పూర్తి అవగాహనతో డీల్ చేస్తే బాగుంటుంది. తోబుట్టువులతో కొనసాగుతున్న వివాదం చర్చల ద్వారా ముగుస్తుంది. మీరు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి.


వృశ్చిక రాశి 
ఈ రోజు మీకు తీరికలేకుండా గడిచిపోతుంది. ఉపాధి కోసం చూస్తున్న వారికి ఈ రోజు మంచి అవకాశం లభిస్తుంది. అత్తమామల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. మీ ఏదైనా పని చాలా కాలంగా నిలిచిపోతే, అది కూడా ఈ రోజు పూర్తవుతుంది. ధార్మిక పనుల పట్ల పూర్తి ఆసక్తి కనబరుస్తారు. పిల్లలపై కోపాన్ని తగ్గించి సమయం గడిపేందుకు ప్రయత్నించండి.


ధనుస్సు రాశి 
ఈ రోజు మీకు చాలా ఫలప్రదమైన రోజు. మీపై కొందరు ప్రత్యర్థులు ఆధిపత్యం చెలాయిస్తారు..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.  మీరు భాగస్వామ్యం వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే అందులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పని ప్రదేశంలో పూర్తి శ్రద్ధవహించండి..అప్పుడే అనుకున్నవి పూర్తవుతాయి. కుటుంబంలో ఒకరి కెరీర్ కు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. 


Also Read: ఈ వారం ఈ రాశివారు తెలివితేటలు, మాట సరిగ్గా వినియోగించుకుంటే శుభఫలితాలు పొందుతారు


మకర రాశి 
ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలి. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. భవిష్యత్ ప్రణాళికల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.ఏదైనా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సంతానం వైపు నుంచి శుభవార్తలు వింటారు. తల్లి ఆరోగ్యంలో కొంత క్షీణత ఉంటే నిర్లక్ష్యం చేయకండి.


కుంభ రాశి 
ఈ రోజు మీలో ప్రేమ, ఆప్యాయతలు నెలకొంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్నవారికి ఈ రోజు కొంచెం బలహీనంగా ఉంటుంది. ఏదైనా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చుచేయండి. పనిలో మార్పులు చేయాల్సి వస్తే మీ జీవితభాగస్వామితో సంప్రదించండి. బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.


మీన రాశి 
ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు. పాత మిత్రుడిని కలుస్తారు. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో సామరస్యం పాటించండి, లేకపోతే సమస్య ఉండవచ్చు.