Significance of Magha Pournami : ఫిబ్రవరి 12 బుధవారం మాఘ పౌర్ణమి..


ఏడాదికి 12 నెలలు
నెలకో పౌర్ణమి
ఆకాశంలో గ్రహాలు తిరుగుతుండడం వల్ల అమావాస్యలు, పౌర్ణమిలు లెక్కలోకి వస్తాయి. శాస్త్రీయంగా చంద్రుడు-భూమి-సూర్యుడు గమనాల ఆధారంగా రాత్రి-పగలు-నెలలు-సంవత్సరాలు లెక్కలు వేస్తారు. 


పాడ్యమి నుంచి పౌర్ణమి, అమావాస్య వరకూ.. అన్ని తిథులు దేనికవే ప్రత్యేకం. వీటిలో ప్రతి ఏకాదశి విశిష్టమైనది. పూర్ణిమలలో మాత్రం నాలుగు పౌర్ణమిలు ప్రత్యేకం. వాటిలో ఒకటి మాఘ పూర్ణిమ. ఈ రోజు దేవరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి రోజు తెల్లవారుఝామున సముద్ర స్నానం ఆచరించాలి. 


వైశాఖీ కార్తీకీ మాఘీ !
తిధయోతీవ పూజిత: !!
స్నానదాన విహీనాస్తా !
ననేయా: పాండునందన !! 


స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా పౌర్ణమిని గడపకూడదు


మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం  ఆచరిస్తే ఆరోగ్యం


ఈ రోజు చేసే దానాలు కోటి రెట్ల ఫలితం వస్తుంది


మాఘ పౌర్ణమి రోజు దాన ధర్మాలు చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ఆత్మశుద్ధి అవుతుంది


శత్రు భాదలు నిశిస్తాయి, పాపాలు తొలగిపోతాయి


మాఘపౌర్ణమి నియమాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మోక్షం పొందుతారు


Also Read: నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్‌.. కుంభమేళాకు వచ్చే భక్తులకు కొత్త ఆంక్షలు ఇవే!


యాగాల్లో అశ్వమేధం


వ్రతాల్లో సత్యనారాయణస్వామి వ్రతం


ధర్మాల్లో అహింస ఎంత గొప్పవో...


స్నానాల్లో మాఘస్నానం అంతేగొప్పది అంటారు పండితులు


జపం, తపం, దానం, వ్రతంతో భగవంతుడిని మెప్పించలేకపోయినా మాఘమాసంలో అదికూడా పౌర్ణమి రోజు చేసే స్నానంతో భగవంతుడి అనుగ్రహం పొందుతారని పద్మపురాణంలో ఉంది. 


కార్తీకమాసంలో దీపం వెలిగించడం ఎంత ప్రధానమో..మాఘంలో స్నానం అంతే ప్రత్యేకం


Also Read: కుంభమేళా కి కౌంట్ డౌన్.. ఎలాంటి కష్టం లేకుండా వెళ్లి వచ్చేయాలి అనుకుంటే ఇలా చేయండి!


మాఘ స్నానం సూర్యోదయానికి ముందే ఆచరించాలి. సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చే కాలం ఇది. సూర్యోదయం సమయంలో సూర్య కిరణాలు భూమిపై పడతాయి...ఈ సమయంలో నీటి సాంద్రతలో వ్యత్యాసం ఉంటుంది. అందుకే మాఘంలో వేకువజామునే స్నానమాచరించాలి.  


మాఘమాసంలో ప్రతిఆదివారం ప్రత్యేకమే. ఈ రోజు తలస్నానం ఆచరించి సూర్య భగవానుడికి నమస్కరించాలి. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పఠిస్తే మంచిది. ఈ నెల మొత్తం మాత్రమే కాదు ఆదివారం రోజు కూడా సూర్యోదయానికి ముందు చేసే స్నానమే ఉత్తమమైనది. ఆ తర్వాత చేసే స్నానం నిష్పలమైనది. 


పౌర్ణమి రోజు సముద్ర స్నానం..అమావాస్య రోజు ప్రయాగరాజ్ లో స్నానమాచరిస్తే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో ఉంది.


నారద పురాణం ప్రకారం మాఘమాసంలో పౌర్ణమి రోజు దేవతల తేజస్సు జలాల్లో ప్రవేశిస్తుందట. అందుకే మాఘస్నానం విశిష్టమైనది.  సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం ఆచరించిన తర్వాత అర్ఘ్యం సమర్పించాలి. 


స్నానం అనంతరం భగవంతుడిని స్మరించుకుని గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. ఓ రాగి పాత్ర నిండుగా నువ్వులు పోసి దానిపై మీ శక్తి కొలది బంగారం ఉంచి మంత్రపూర్వకంగా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ రోజు చేసే దానాల వల్ల శత్రు బాధలు తొలగిపోయి, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 


ఇంట్లో పూజా మందిరాన్ని సిద్ధం చేసుకుని విష్ణు భగవానుడిని పూజించాలి. ఆవునేతితో దీపం వెలిగించాలి. విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి.


Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!