Ind Vs Eng 3rd Odi Updates: సిరీస్ దక్కించుకోవాలని భారత్ ఆరాటం.. పరువు కోసం ఇంగ్లాండ్ పోరాటం.. మెగాటోర్నీకి ముందు చివరి వన్డేలో ఢీ..
రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ ఫామ్ లోకి రావడం పెద్ద రిలీఫ్. తను సత్తా చాటి ఆ మ్యాచ్ ను ఒంటిచేత్తో ఫలితాన్ని తారుమారు చేశాడు. ఇక మరిన్ని విషయాలపై భారత్ కు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.

Narendra Modi Stadium News: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి ముందు చివరి వన్డేను భారత్ రేపు ఆడబోతోంది. బుధవారం ఇంగ్లాండ్ తో నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లను గెలిచిన ఇండియా.. సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతోపాటు మెగాటోర్నీకి మరింత ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని భావిస్తోంది. సిరీస్ లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన ఇండియా.. చాలా సమస్యలను అధిగమించింది.
రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం పెద్ద రిలీఫ్. తను సత్తా చాటి ఆ మ్యాచ్ ను ఒంటిచేత్తో ఫలితాన్ని తారుమారు చేశాడు. ఇక మరిన్ని విషయాలపై భారత్ కు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ మహ్మద్ షమీ అంచనాలను అందుకోవాల్సి ఉంది. రేపటి మ్యాచ్ లో వీరు సత్తా చాటితే అంతకుమించి భారత్ కు ఏమీ ఉండదు.
సీమర్లకు అనుకూలం..
మూడో వన్డే వేదికైన నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రపంచలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. లక్షకుపైగా ఒకేసారి కూర్చోని మ్యాచ్ చూడవచ్చు. ఇక ఈ స్టేడియంల లిమిటెడ్ ఓవర్లలో బౌలర్లకు మంచి సహకరాం అందిస్తూ వస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు 31 మ్యాచ్ లు ఆడగా, తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 16 సార్లు గెలిచాయి. సగటు స్కోరు 243 కావడం విశేషం. ఈ పిచ్ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాదు. 2010 తర్వాత ఇక్కడ 300+ స్కోరు నమోదు కాలేదు. ఇక్కడ సీమర్లు ఓవరాల్ గా 257 వికెట్లు తీస్తే, స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేసి, 137 వికెట్లు మాత్రమే తీశారు.
మంచు ప్రభావం..
రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు మంచు ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టాస్ గెలిచిన జట్లు బౌలింగ్ తీసుకునే అవకాశముంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. అల్రెడీ సిరీస్ గెలిచింది, కాబట్టి, ఒకరిద్దరు రిజర్వ్ ప్లేయర్లను పరీక్షించే అవకాశముంది. రిషబ్ పంత్ వికెట్ కీపర్ గా తీసుకుని, రాహుల్ ను టాప్ 4లో ఆడించిన ఆశ్చర్యం లేదు. మరోవైపు మెగాటోర్నీకి ముందు చివరి వన్డే కావడంతో ఈ మ్యాచ్ లో గెలిచి, పరువు దక్కించుకోవడంతోపాటు, ఆత్మవిశ్వాసంతో టోర్నీ జరిగే పాక్ గడ్డపై అడుగు పెట్టాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ ను డిస్నీ హాట్ స్టార్ ఓటిటితోపాటు స్పోర్ట్స్ 18 2 చానల్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.