Puja Niyam: హిందూ గ్రంధాలు పూజకు సంబంధించి అనేక నియమాలను రూపొందించాయి. ఆ నియమాలలో ఒకటి మధ్యాహ్నం పూట దేవుడిని పూజించకూడద‌ని చెబుతోంది. ఈ నియమాన్ని పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని పేర్కొన్నారు. మధ్యాహ్న సమయంలో భగవంతుడిని ఎందుకు పూజించకూడదో తెలుసుకుందాం.


పూజ ప్రాముఖ్యత
హిందూ సంస్కృతి, సంప్ర‌దాయంలో, రోజువారీ దినచర్యలో ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ప్రతిరోజూ పూజ చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని, తమ జీవితాల్లో ముందుకు సాగేందుకు ప్రేర‌ణ పొందుతామ‌ని ప్రజలు నమ్ముతారు.


రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం


పూజకు సరైన సమయం
తెల్లవారుజామున పూజకు ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరం, మనస్సు రెండూ స్వచ్ఛంగా ఉంటాయి. ఇది భగవంతుని ఆరాధనలో మన దృష్టిని, భక్తిని కేంద్రీకరించడానికి అనుమతిస్తుంది. అందువ‌ల్ల ఈ సమయంలో పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది.


సమయం ప్రయోజనం
మన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టినప్పుడల్లా శుభ ముహూర్తం కోసం చూస్తాం. సరైన సమయంలో చేసే పూజలను భ‌గ‌వంతుడు స్వీకరిస్తాడనేది దాని వెనుక కారణం. అంటే ఇతర సమయాల్లో చేసే పూజల వల్ల మనకు ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆ ప్రార్థనలను భ‌గ‌వంతుడు అంగీకరించదు. ఇత‌ర స‌మ‌యాల్లో మనం చేసే ప్రార్థన లేదా పూజలను భ‌గ‌వంతుడు ఎలా అంగీకరించడో మధ్యాహ్న సమయం పూజ‌కు కూడా అదే ఫ‌లితం వ‌ర్తిస్తుంది.


పూజకు ఐదు శుభ ముహూర్తాలు
రోజుకు కనీసం ఐదుసార్లు భగవంతుడిని పూజించాలని పెద్ద‌లు చెబుతారు. తెల్ల‌వారుజామున‌ 4.30 నుంచి 5 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో తొలిపూజ‌, ఉదయం 9 గంటలకు రెండో పూజ, మధ్యాహ్నం 12 గంటల వరకు మూడో పూజ, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య నాల్గవ పూజ, రాత్రి 9 గంట‌ల‌కు ముందు ఐదవ పూజ చేయాలి.


మధ్యాహ్నం పూజలు లేవు
మధ్యాహ్న పూజ చేసినా ఫలితం ఉండదని, ఆ సమయంలో పూజించినా ఫలితం దక్కదని అంటారు. దీనికి కారణం మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య భ‌గ‌వంతుడు విశ్రాంతి తీసుకునే సమయం. ఈ సమయంలో చేసే పూజను ఆయ‌న్ను అంగీకరించడు. ఈ సమయాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు, ఇది పూర్వీకుల కాలం. అందుకే భ‌గ‌వంతుడు ఈ పూజను లేదా ప్రార్థనను అంగీకరించడు.


పూర్వీకులకు (వారి పూర్వీకుల ప్రకారం వివిధ వ్యక్తులు & ప్రదేశాలు) నైవేద్యాలు సమర్పించే నారాయణ సమయం కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు పూజకు దూరంగా ఉండాలని గ్రంధాలు చెబుతున్నాయి. మీరు సాయంత్రం 5 గంటల తర్వాత దీపం వెలిగించి పూజ చేయవచ్చు. ఇంతకు ముందు రోజుల్లో రోజుకి 2 లేదా 3 సార్లు పూజ చేసేవారు. కానీ ఇప్పుడు అందరూ తమ రోజువారీ వ్య‌వ‌హారాల్లో బిజీ షెడ్యూల్ వల్ల ఉదయం పూజ‌కే పరిమితమయ్యారు.


పూజ చేయడానికి ఉత్తమ సమయం


రోజులో ఐదు సార్లు పూజ చేయాలని వేదం సూచించింది
తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంట‌ల‌ మధ్య బ్రాహ్మీ ముహూర్తంలో తొలిపూజ‌
అనంతరం ఉదయం 9 గంటలకు రెండ‌వ‌ పూజ,
మధ్యాహ్నం 12:00 గంటలకు మధ్యాహ్న పూజ. ఆ తర్వాత మీరు భ‌గ‌వంతుడికి విశ్రాంతి ఇవ్వాలి.
సాయంత్రం 4:30 నుండి 6:00 గంటల మధ్య మళ్లీ సంధ్య పూజ
అనంతరం రాత్రి 9:00 గంటలకు శయన పూజ చేసి భగవంతుడిని నిద్రపుచ్చాలి.


Also Read : చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి


ప్రస్తుత జీవన విధానం మనలో చాలామందిని రోజుకు ఐదుసార్లు పూజలు చేసేందుకు అనుమ‌తించ‌డం లేదు కాబట్టి, భగవంతుని అనుగ్రహం కోసం కనీసం రోజుకు రెండుసార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పూజ చేయడం మంచిది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.