ధనం మూలం ఇదం జగత్. జీవితంలో డబ్బుకున్న ప్రాధాన్యత అటువంటిది. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టపడి పని చేసేది డబ్బు కోసమే. అయితే అన్ని సార్లు అందరూ కష్టానికి తగిన ఫలితం దొరకదు. ఒకవేళ డబ్బు సంపాదించగలిగినా అది నిలబడదు. నిల్వకాదు. ఎంత ప్రయత్నం చేసినా ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం మన సనాతన ధర్మశాస్త్రాలలో చాలా రకాల పరిహారాలు ఎన్నో ఉన్నాయి.
మట్టి కలశం
ఒక చిన్న మట్టి కుండ తీసుకోవాలి. ఇందులో రూపాయి నాణాలు 5 ఉంచాలి. వాటితో పాటుగా బియ్యం, గోధుమలు, బార్లీ వంటి ఇతర ధాన్యంతో కలశం నింపాలి. ఈ కలశాన్ని ఎర్రని వస్త్రంతో కప్పి దారంతో కట్టి మూసెయ్యాలి. ఇప్పుడు దీన్ని లక్ష్మీ పూజలో ఉంచాలి. పూజ తర్వాత ఈ కలశాన్ని డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపించవచ్చు. రోజులు గడిచేకొద్ది కాలం కలిసి రావచ్చు.
కొబ్బరికాయ పరిహారం
కొబ్బరికాయ ను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని దారంతో కట్టాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయను లక్ష్మీ పూజ లో ఉంచి పూజ చెయ్యాలి. ఆతర్వాత దాన్ని డబ్బు దాచుకునే చోట భద్రపరచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.
లక్ష్మీ ఆరాధన
శుక్రవారం లక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూజ చేసుకుని పసుపు వేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటికి రమ్మని ఆహ్వానించాలి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి. గులాబి పువ్వులు, గులాబి మాలను అమ్మవారికి సమర్పించాలి. ఇలా వరుసగా 11 శుక్రవారాల పాటు క్రమంతప్పకుండా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటుండదు.
గవ్వలు
ఎల్లో కౌరీస్ అనే గవ్వలను ఏడింటిని తీసుకుని ఇంటిలో జాగ్రత్త చేసుకోవాలి. ఈగవ్వలు ఇంట్లో ఉంటే దరిద్ర్యం దరి చేరదు. లక్ష్మీపూజలో ఉంచిన డబ్బు కూడా నిలిచి ఉంటుంది.
ఈ పనులు చెయ్యకూడదు
నీటి వృథా తగదు
చాలా మంది నీటి వృథాను అసలు పట్టించుకొరు. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. నీటిని వృధా చెయ్యకూడాదు. నీటి వృథా జరిగే చోట లక్ష్మీదేవి ఉండదు. ఎప్పటికప్పుడు అన్ని కుళాయిలు కట్టేస్తూ ఉండాలి. లీకేజిలు లేకుండా చూసుకోవాలి.
పూజ గదిలో నైర్మల్యం
ఆది పూజ ఎప్పుడూ గణపతికే అనే విషయాన్ని మరువకూడదు. ప్రతి రోజూ మొదటి పూజ తప్పకుండా గణపతికే చెయ్యాలి. కొంత మంది పూజా మందిరంలో పూజకు ఉపయోగించిన పూలు, అలంకరణకు వాడిన పువ్వులను చాలారోజుల పాటు తీసెయ్యకుండా అలాగే ఉంచేస్తారు. అది మంచిది కాదు. ప్రతిరోజు నైర్మల్యాన్ని తీసెయ్యాలి. లేకపోతే ఇంట్లో సంపద నిలువదు.
తలుపుల్లో శబ్ధం
ఇంట్లో తలుపులు లేదా కిటికీలు తెరుస్తున్నపుడు చప్పుడు చేస్తుంటాయి. అది అసలు మంచిది కాదు. అలా చప్పుడు చేస్తున్న తలుపు ఊచల్లో నూనె వేసి చప్పుడు రాకుండా చూసుకోవాలి. ఇది ఆర్థిక నష్టాలకే కాదు, ఇంట్లో అనుబంధాల మధ్య కూడా చిచ్చు పెడుతుంది.
విరిగిన లేదా పగిలిన వస్తువులు
ఇంట్లో విరిగిన లేదా పగిలిన వస్తువులు ఎలాంటివైనా సరే వాటిని తొలగించాలి. ఇలా విరిగి పోయిన లేదా పగిలిపోయిన వస్తువుల వల్ల ఇంట్లో డబ్బు నిలవదు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.