పరమేశ్వరుడికి సోమవారం ప్రీతికరమైన వారం. సోమ .. అంటే, స - ఉమ అని అర్. ఉమతో కూడినవాడు శివుడు...అందుకే సోమవారం చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయంటారు. ఏ సోమవారం అయినా శివయ్యకు ప్రీతే కానీ కార్తీక సోమవారం అంతకుమించి. ఈ రోజు శివుడిని బిల్వ దళాలతో పూజిస్తే మనోభీష్టం నెరవేరుతుంది. ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివుడిని కొలిస్తే మాంగల్యబలం చేకూరుతుంది. కార్తీకసోమవారం రోజు శివుడి సన్నిధిలో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది. శివాలయంలో దీపాన్ని వెలిగిస్తే సమస్తదోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలు పాటిస్తే మోక్షానికి చేరవవుతారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతిసోమవారం ఉపవాసం, పూజ చేయకపోయినా..కనీసం మూడోసోమవారం కనీస నియమాలు పాటిస్తే మంచిదంటారు. రుద్రాభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది...ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు, ఆహారానికి కొరత ఉండదని పండితులు చెబుతారు.
Also Read: వైరాగ్యం కావాలంటే శివుడికి వీటితో అభిషేకం చేయండి
మారేడు చెట్టును త్రిమూర్తి స్వరూపంగా, లక్ష్మీ రూపంగా ఆరాధిస్తారు. మహాశివుడికి మారేడు దళాలంటే ఇష్టం. అందుకే మారేడును శివేష్ట అని అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని విశ్వాసం. అందుకే కొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు.
శివయ్య భక్తుల కోసం బిళ్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం
అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం
బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం