ABP  WhatsApp

Odisha News: ఫుల్లుగా సారా తాగేసి హాయిగా బజ్జున్న 24 ఏనుగులు!

ABP Desam Updated at: 11 Nov 2022 10:33 AM (IST)
Edited By: Murali Krishna

Odisha News: ఒడిశాలో దాదాపు 24 ఏనుగులు.. నాటుసారా తాగేసి హాయిగా గాఢ నిద్రలోకి వెళ్లిపోయాయి.

(Image Source: PTI)

NEXT PREV

Odisha News: ఒడిశాలోని అడవిలో దాదాపు 24 ఏనుగులు గంటల తరబడి నిద్రించాయి. నీళ్లు అనుకొని నాటుసారా తాగడం వల్లే ఇవి గాఢ నిద్రలోకి పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఇదీ జరిగింది


ఒడిశా కియోంజర్‌ జిల్లా పరిధిలోని అడవిలోకి స్థానిక గ్రామస్థులు వెళ్లారు. అక్కడ దొరికే కొన్ని పూలు, పండ్లతో 'మహువా' అనే సంప్రదాయక నాటు సారాను తయారు చేయడానికి అన్నీ సిద్ధం చేశారు. తొలుత వాటిని నానబెట్టి ఇంటికి వచ్చారు.


మరుసటి రోజు మంగళవారం తిరిగి అడవిలోకి వెళ్లారు. అయితే వీటిని నానబెట్టి ఉన్న కుండలు పగిలిపోయి ఉండటాన్ని చూసి షాకయ్యారు. కొంతదూరం వెళ్లి చూస్తే 24 ఏనుగులు గాఢ నిద్రలో ఉన్నాయి. కుండల్లోని నానబెట్టిన నీటిని ఏనుగులు తాగేశాయని గుర్తించిన గ్రామస్థులు.. అటవీ అధికారులకు సమచాారం ఇచ్చారు.



మేము ఉదయం 6 గంటలకు మహువా సిద్ధం చేయడానికి అడవిలోకి వెళ్ళాం. కుండలన్నీ పగలిపోయి ఉన్నాయి. పులియబెట్టిన నీరు కనిపించలేదు. కొంత దూరంలో ఏనుగులు నిద్రపోతుండటం మేము చూశాం. అవి పులియబెట్టిన ఆ నీటిని తాగాయి. ఆ మద్యం ఇంకా పూర్తిగా తయారు చేయలేదు. మేం ఆ ఏనుగులను లేపడానికి ప్రయత్నించాం. కానీ అవి లేవలేదు. దీంతో అటవీ శాఖకు సమాచారం అందించాం.                                           - నారియా సేథి, గ్రామస్థుడు


గ్రామస్థుల సమాచారంతో అటవీ అధికారులు అక్కడికి వెళ్లారు. అధికారులు భారీ శబ్ధం చేయడంతో ఏనుగులు లేచి వెళ్లిపోయాయి. ఏనుగుల గుంపు అప్పటికే మత్తెక్కించే పువ్వులతో పులియబెట్టిన నీటిని తాగినందుకే గాఢ నిద్రలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.


Also Read: Viral Video: ఉడతలు కుర్‌కురే తింటాయా? ఎలా తినిపించావు నాయనా!

Published at: 11 Nov 2022 10:28 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.