Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్య ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా జంతువుల వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఉడుతలకు కుర్‌కురే తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇలా జరిగింది
ఈ వైరల్ వీడియోలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి కుర్‌కురే తింటున్నాడు. అయితే కొద్దిసేపటికి అతని దగ్గరకి ఉడతలు వచ్చాయి. అందులో ఓ ఉడుత అతను కూర్చొన్న బల్లపైకి వచ్చింది. దీంతో మెల్లిగా వాటికి ఆ వ్యక్తి కుర్‌కురే తినిపించాడు. దీంతో చాలా ఉడతలు అతని దగ్గర గుమికూడాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల
కొంతమంది ఉక్రెయిన్ సైనికులు తమ శిబిరం దగ్గర సేద తీరుతున్నారు. ఆ సమయంలో ఓ ఉడత వారి దగ్గరికి వచ్చింది. వారిపైన ఎక్కి అటుఇటూ తిరిగింది. ఆ తర్వాత ఓ సైనికుడి వెంట పరిగెత్తింది. ఆ జవాను కూడా సరదాగా దాని నుంచి తప్పించుకుని తిరిగాడు. కాసేపటి తర్వాత మిగిలిన సైనికులను కూడా ఆట పట్టించింది ఉడత. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 7 నెలలు పూర్తయింది. అయితే ఇప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నిర్విరామంగా కొనసాగుతోంది. రష్యా సైన్యం దాడులను ఉక్రెయిన్ జవాన్లు సమర్థంగా తిప్పికొడుతున్నారు. కుటుంబాలకు దూరమై ఉక్రెయిన్ సైనికులు దేశంగా కోసం పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఉడుత వారిని కాసేపు ఆటపట్టించింది.
Also Read: Noida News: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కారుతో ఢీ కొట్టాడు- వైరల్ వీడియో!