Stocks to watch today, 11 November 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 299.5 పాయింట్లు లేదా 1.65 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,396.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్‌ కంపెనీలు:  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), మహీంద్రా & మహీంద్రా, అదానీ పవర్, హిందాల్కో ఇండస్ట్రీస్, ABB ఇండియా, ఇన్ఫో ఎడ్జ్, జైడస్ లైఫ్ సైన్సెస్, ఆస్ట్రల్, ఆల్కెమ్ ఇండస్ట్రీస్, వేదాంత్‌ ఫ్యాషన్స్, థర్మాక్స్, డెలివెరీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


DCX సిస్టమ్స్: అక్టోబర్ 31-నవంబర్ 02 తేదీల్లో జరిగిన IPO ద్వారా ఒక్కో షేరును రూ. 197-207 పరిధిలో విక్రయించి, రూ. 500 కోట్లను సమీకరించిన ఈ కంపెనీ శుక్రవారం దలాల్ స్ట్రీట్ అరంగేట్రం చేస్తోంది.


ఐషర్ మోటార్స్: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత పన్ను తర్వాతి లాభం 76 శాతం పెరిగి రూ. 657 కోట్లకు చేరుకుంది. 2021-22  జులై-సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ రూ. 373 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.


అపోలో హాస్పిటల్స్: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 213 కోట్లకు దిగి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ కాలంలో రూ. 267 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


అదానీ గ్రీన్ ఎనర్జీ: ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లేయర్ ఏకీకృత నికర లాభం FY23 సెప్టెంబర్ త్రైమాసికంలో 49 శాతం పెరిగి రూ. 149 కోట్లకు చేరుకుంది. రాబడి పెరగడం ప్రధాన కారణం. సెప్టెంబర్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.100 కోట్లు.


పేజ్ ఇండస్ట్రీస్: సెప్టెంబర్ 2022తో ముగిసిన రెండో త్రైమాసికంలో, ఈ దుస్తులు తయారీ సంస్థ నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 162.12 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ రూ. 160.48 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


బాటా ఇండియా: స్టోర్‌లలో పెరిగిన ఫుట్‌ఫాల్స్‌తో ఈ షూ మేకర్ పుంజుకుంది. సెప్టెంబరు 2022తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 54.82 కోట్లకు చేరింది, గత ఏడాది కంటే 47.44 శాతం పెరిగింది. ఏడాది క్రితం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ. 37.18 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


ది ఇండియన్ హోటల్స్ కంపెనీ: ప్రయాణ డిమాండ్ వృద్ధి కారణంగా టాటా గ్రూప్‌నకు చెందిన హాస్పిటాలిటీ సంస్థ నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లింది. 2022 సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 129.59 కోట్ల ఏకీకృత పన్ను తర్వాతి లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 130.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది.


FSN ఈ-కామర్స్ వెంచర్స్‌ (Nykaa): మూడు సంస్థలు- లైట్‌హౌస్ ఇండియా ఫండ్ III, మాల గోపాల్ గాంకర్, నరోత్తమ్ S సెఖ్‌సారియా- 2,84,34,390 నైకా షేర్లను, ఒక్కో షేరును సగటున రూ. 171.75- రూ. 173.74 ధరకు మార్కెట్‌లో అమ్మాయి. మొత్తం డీల్‌ విలువ రూ. 491.35 కోట్లు.


జొమాటో: సెప్టెంబర్ 2022తో ముగిసిన రెండవ త్రైమాసికంలో ఈ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఏకీకృత నికర నష్టాన్ని రూ. 250.8 కోట్లకు తగ్గింది. కంపెనీ ఏకీకృత నికర నష్టం ఏడాది క్రితం ఇదే కాలంలో రూ. 434.9 కోట్లుగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.