Kalki Real Story: శ్రీ మహావిష్ణువు దశావతారమే కల్కి. కలిపురుషుడి ప్రభావంతో భూమిపై ధర్మం అనే మాట పూర్తిగా మాయమైందంటూ దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు. స్వామీ  ధర్మసంస్థాపన దిశగా మీరు భూమిపై అడుగుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు. సరే అన్న శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో శంబలలో విష్ణుయశుడు-సుమతి దంపతులకు జన్మిస్తానని చెప్పారు. ఇక వైకుంఠం నుంచి కిందకు బయలుదేరుతుండగా... లక్ష్మీదేవి, భూదేవి, గరుత్మంతుడు వీళ్లంతా ఎవరి సందేహాలు వారు వ్యక్తం చేశారు.


లక్ష్మీదేవి: స్వామీ మీరు శంబలలో కల్కిగా జన్మిస్తారు..మరి నేను మిమ్మల్ని ఎలా చేరుకోగలను...
విష్ణువు:  సింహళ దేశంలో ఓ రాజుకి పద్మావతిగా జన్మిస్తావు
లక్ష్మీదేవి : త్రేతాయుగంలో రుక్మిణీదేవిలా జన్మించి మిమ్మల్ని చేరుకునేందుకు చాలా అగచాట్లు పడ్డాను.. శిశుపాలుడితో పెళ్లి జరిగే సమయంలో  సందేశం పంపించిన తర్వాత వచ్చి తీసుకెళ్లారు..ఈ జన్మలో కూడా అన్ని బాధలు అనుభవించలేను..మిమ్మల్ని చేరుకునే మార్గంకూడా చెప్పండి 
విష్ణువు: నీకు పరమేశ్వరుడి నుంచి ఓవరం లభిస్తుంది..ఆ వరమే శాపం అవుతుంది..ఆ శాపమే మళ్లీ వరంగా మారి నన్ను చేరుకునేలా చేస్తుంది..


Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!


వైశాఖ శుద్ధ ద్వాదశి కల్కి జననం


ఆ తర్వాత భూదేవి, గరుడుడి సందేహాలను నివృతి చేసి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ధర్మసంస్థాపనార్థం భూమ్మీదకు బయలుదేరాడు. వైశాఖ శుద్ధ ద్వాదశి రోజు శంబలలో విష్ణువు ఇంట జన్మించాడు. (కల్కి ఇంకా రాబోతున్నాడు కదా మరి ఇవన్నీ ఎలా చెబుతున్నారు అనే సందేహం రావొచ్చు..అయితే పురాణాల్లో కల్కి పుట్టుక గురించి భాగవత పురాణం, బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రస్తావించి ఉంది). వైకుంఠం నుంచి వచ్చి విష్ణుయశుడి ఇంట జన్మించిన స్వామిని చూసేందుకు దేవతలంతా తరలివచ్చారు...సకల ఉపచారాలు చేశారు.  సప్త చిరంజీవులంతా దర్శనం చేసుకోవాలని వచ్చారు. కృపాచార్యులు, అశ్వత్థాముడు, పరశురాముడు, వేద వ్యాసుడు సహా సప్త చిరంజీవులంతా భిక్షకుల రూపంలో వచ్చి ఆశీర్వదించి..కల్కి అనే పేరు పెట్టారు.  చేసి కల్కి అనే పేరు పెట్టారు. కల్కము అంటే పాపం అని అర్థం...పాపాన్ని పోగెట్టేవాడే కల్కి...


Also Read: అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు? ‘కల్కి 2898 ఏడీ’ లో అమితాబ్ నుదుట కనిపించిన అద్భుతమైన మణి గురించి తెలుసా!
 
పరశురాముడే కల్కి గురువు


వయసు పెరిగిన తర్వాత ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం పంపించారు. తానే శ్రీ మహావిష్ణువు అనే స్పృహ లేదు..గురుకులం వెతుక్కుంటూ బయలుదేరాడు కల్కి. మార్గమధ్యలో మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు ఆ బాలుడిని కలసి తీసుకెళ్లి సకల విద్యలు నేర్పించాడు. గురుదక్షిణగా ఏం కావాలని కల్కి అడిగితే..అప్పటివరకూ తాను సాధారణ బాలుడినే అనే ఆలోచనలో ఉన్న కల్కికి అవతార ఆంతర్యం గురించి వివరించాడు పరశురాముడు. కలి సంహారం కోసం జన్మించిన నారాయణుడు... అధర్మంతో నిండిపోయిన భూమిపై ధర్మసంస్థాపన చేసేందుకు భూమ్మీదకు వచ్చారని చెప్పాడు. అప్పటికి తానెవరో స్ఫురుణకు వచ్చింది...


శివుడి కోసం తపస్సు


పరశురాముడి మాటలు విన్న కల్కి..విద్యాభ్యాసాన్ని ముగించుకుని వెళ్లిన తర్వాత పార్వతీపరమేశ్వరులకోసం తపస్సు చేశాడు. అప్పుడు ప్రత్యక్షమైన శివుడు...గారుడం అనే తెల్లటి గుర్రాన్ని ప్రసాదించాడు ( ఇదే విష్ణువు వాహనం గరుత్మంతుడు). భారమైన ఖడ్గాన్నిచ్చి ఇదే భూమి భారాన్ని తీరుస్తుందని చెప్పాడు. ఆ తర్వాత సర్వజ్ఞుడు అనే మాట్లాడే చిలుకను ప్రసాదించాడు. ఈ చిలుక ఎందుకు అని కల్కి అడిగితే మీ కథను మలుపుతిప్పేదే చిలుక అని చెప్పి అంతర్థానమయ్యాడు శివుడు....


పరశురాముడి దగ్గర సకలవిద్యలు నేర్చుకున్న కల్కి.. శివుడి నుంచి వరాలు పొంది తిరిగి శంబలకు పయనమయ్యారు. మరి శ్రీలంకలో ఉన్న అమ్మవారిని ఎలా చేరుకున్నారు? కల్కిని ధర్మ సంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి? మరో కథనంలో తెలుసుకుందాం...


Also Read: ఈ ఆలయంలో 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతీక - ప్రస్తుతం ఉన్న ఒక్క స్తంభం కూలిపోతే కలియుగాంతమే!