Mauni Amavasya 2025 : హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌని అంటే నిశ్శబ్దం. కాబట్టి ఈ రోజున మౌనం పాటించడం, ఉపవాసం ఉండడం ద్వారా మానసిక, ఆధ్యాత్మిక బలాన్ని పొందుతారని చెబుతారు. ఈ రోజున నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించడం, దానం చేయడం వల్ల చేసిన పాపాలు తొలగిపోయి, మోక్షం ప్రాప్తిస్తుందని అనేక మంది విశ్వసిస్తుంటారు. అందులోనూ ఈ రోజు గంగా నది (Ganga River)లో చేసే స్నానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో (Triveni Sangam) స్నానాలాచరించేందుకు వెళ్తుంటారు. సూర్య భగవానుడు, పూర్వీకులను పూజించేందుకు ఇది ఉత్తమమైన రోజు. ఈ ఏడాది ఇది జనవరి 29వ తేదీన రాబోతోంది.
మౌని అమావాస్య తిథి
హిందూ విశ్వాసాల ప్రకారం, మాఘ మాస అమావాస్య తిథి జనవరి 28వ తేదీ రాత్రి 7.32 గంటలకు ప్రారంభమై జనవరి 29న సా.6.05 గంటలకు ముగుస్తుంది.
శుభ ముహూర్తం
మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తం జనవరి 29వ తేదీన ఉ. 5.25 గంటలకు ఆరంభమై 6.18 గంటల వరకు ఉంటుంది.
మౌని అమావాస్య ప్రాముఖ్యత
మౌని అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజున గంగా జలం అమృతంలా మారుతుందని చెబుతారు. మను మహర్షి మాఘమాసంలో వచ్చే అమావాస్య రోజున జన్నించాడని, అందుకే ఈ తేదీని మౌని అమావాస్య అని పిలుస్తారని నమ్ముతుంటారు. ఈ రోజు మౌనం పాటిస్తే వారు తమ జీవితంలో విజయం సాధిస్తారని అనేక మంది విశ్వసిస్తుంటారు.
మౌని అమావాస్య - పూజా విధానం
మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేల్కోవడం ఫలప్రదంగా చెబుతారు. ఈ రోజున వీలైతే గంగా నదిలో స్నానం చేయాలి. అది సాధ్యం కాని యెడల స్నానం చేసే నీళ్లలో గంగా జలం కలిపి స్నానం చేయొచ్చు. ఆ తర్వాత లోకానేలే శ్రీ మహా విష్ణువును ధ్యానించి, ఉపవాసం ఉండాలి. అనంతరం ఇంట్లో లేదా దగ్గర్లోని తులసి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత మీ తాహత మేరకు పేదలకు ఆహారం, డబ్బు, బట్టలు లేదా ఇంకేదైనా దానం చేయండి.
ఈ పరిహారాలతో మౌని అమావాస్యను జరుపుకోండి
- తమ పూర్వీకుల అనుగ్రహం పొందాలనుకునే వారు ఈ రోజున పసుపు పంగు దుస్తులు ధరించి తమ పెద్దలను స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి ఆత్మ శాంతించి, ఆశీర్వచనాలు అందిస్తారని నమ్ముతుంటారు.
- ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపు కలిపిన నీళ్లను చిలకరించి, ఇంటి తలుపును కూడా నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందంటారు.
- ఈ రోజున మహా విష్ణువుతో పాటు తులసి చెట్టును కూడా అత్యంత భక్తి, శ్రద్దలతో పూజించాలి, ధ్యానించాలి.
Also Read : Types of Salt : ఉప్పుల్లోని రకాలు.. వాటి ఉపయోగాలు.. దేనిని వాడితే వంటకు రుచి పెరుగుతుందో తెలుసా?