ఫిబ్రవరి 24 రాశిఫలాలు

మేష రాశి

ప్రతికూల ధోరణులతో ఇబ్బంది ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనల ప్రభావం మీపై ఉంటుంది. విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటారు. పిల్లల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగం, వ్యాపారంలో సాధారణ ఫలితాలుంటాయి

వృషభ రాశి

ఈ రోజు మీ పనులలో కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి.  తోబుట్టువులతో ఇబ్బంది ఉంటుంది. భావోద్వేగంతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దు.  దినచర్య అసమతుల్యతతో ఉండనివ్వవద్దు. శరీరంలో బలహీనత అనిపిస్తుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది.  

మిథున రాశి

ఈ రాశివారు విద్యలో కష్టపడాలి. ఉద్యోగుల పని నాణ్యత పెరుగుతుంది. అనవసర విషయాల గురించి చింతించకండి. రోజంతా ఆనందంగా ఉంటారు. ఆదాయ మూలాలు పెరుగుతాయి 

Also Read: నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు..చిదానందరూపాన్ని శివుడిని!

కర్కాటక రాశి

స్నేహితుల నుంచి మీకు మద్దతు పెరుగుతుంది. చాలా విషయాల్లో రిలాక్స్ గా ఉంటారు. రాజకీయాల్లో ఉండేవారి గౌరవం పెరుగుతుంది. కొన్ని వివాదాలకు చెక్ పెడతారు. నూతన ఆస్తిలు పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచిసమయం

సింహ రాశి

ఈ రోజు మీ వైవాహిక జీవితం బావుంటుంది. క్యాటరింగ్ సంబంధిత వ్యాపారాలు చేసేవారు నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రసంగం సమయంలో సంయమనం పాటించండి. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. తెలియని వ్యక్తుల కారణంగా నష్టపోతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతుంది.  

కన్యా రాశి

ఈ రోజు మీరు కుటుంబంతో సంప్రదించకుండా ఏ పనీ చేయవద్దు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలుంటాయి. ప్రభుత్వ శాఖతో సంబంధం ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రోజు మీరు అనుకోని ప్రయోజనం పొందుతారు. ఆధ్యాత్మిక రచనలు మీకు మంచి ప్రయోనజాన్నిస్తాయి.  

తులా రాశి

వ్యాపారంలో కొత్త ప్రారంభాలుంటాయి. నూతన పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఉద్యోగుల  ఖ్యాతి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కొనసాగుతున్న ఉద్రిక్తత ఉపశమనం పొందుతుంది. మీరు జీవిత భాగస్వామితో పర్యాటక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

Also Read: ఈ రాశులవారు పనికిరాని రచనలతో సమయం వృధా చేసుకుంటారు - ఫిబ్రవరి 24 to మార్చి 02 వారఫలాలు!

వృశ్చిక రాశి

 వైవాహిక సంబంధాలకు రోజు చాలా మంచిది. మీరు మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

ధనుస్సు రాశి

ఈ రోజు ఉద్యోగులు ఉన్నత స్థానాలు పొందుతారు. ప్రియమైనవారితో మంచి  సాయంత్రం గడుపుతారు. వ్యాపారంలో  పురోగతితో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావారణం ప్రశాంతంగా ఉంటుంది

మకర రాశి

ఈ రోజు అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. మనస్సు పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి బాధపడుతుంది.  ఇతరుల మాటలను నమ్మవద్దు. దినచర్య కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రసంగంలో చేదు కారణంగా జీవిత భాగస్వామితో వివాదం ఉండవచ్చు. 

Also Read: ఫిబ్రవరి 24 నుంచి మార్చి 02 ఈ వారం ఈ 5 రాశులవారికి ప్రతిక్షణం అద్భుతం అనేలా ఉంటుంది!

కుంభ రాశి

సమస్యలో ఉండేవారికి సహాయం చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. పిల్లల గురించి ఏదైనా ముఖ్యమైన పని పూర్తిచేస్తారు. ఈ రోజు మీరు అనుకోని బహుమతి పొందుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు.

మీన రాశి

మీ పనిలో నాణ్యత పెరుగుతుంది..ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయటా గౌరవం అందుకుంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఉత్సాహంగానే ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.