మేషం
ఈ రోజు మీరు కార్యాలయంలో పెద్ద బాధ్యత స్వీకరిస్తారు. తెలియని వ్యక్తితో అభిప్రాయ భేదాలు రావొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.  స్నేహితులను కలుస్తారు. వ్యాపారులు కొంత నష్టపోతారు.  విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఆస్తి వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతుల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.
వృషభం
కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఈ రోజు మీరు వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోగలరు. వృద్ధుల ఆరోగ్యం క్షీణించవచ్చు. ఎప్పటినుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. మతపరమైన యాత్రకు వెళ్తారు. అదృష్టం కలిసొస్తుంది. సమాజంలో ప్రశంసంలందుకుంటారు. కార్యాలయంలో మీ ఉన్నతాధికారులు మీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. పెట్టుబడులు పెట్టేందుకు శుభసమయం. 
మిథునం
విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. వ్యాపారులు లాభపడతారు.  ప్రణాళికలు అమలుపరిచేందుకు ప్రయత్నించండి.  మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కార్యాలయంలో ఆనందకరమైన సమాచారాన్ని పొందుతారు. యువత కెరీర్ పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సోమరితనం వద్దు వివాదాలకు దూరంగా ఉండండి. 
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
కర్కాటకం
ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దూరపు ప్రయాణాలు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.  అవివాహితులకు సంబంధ చర్చలు సాగుతాయి. ఆస్తికి సంబంధించి బంధువులతో వివాదం ఉండొచ్చు.  కార్యాలయంలో సహోద్యోగుల సహకారంతో మీ పనిని పూర్తి చేయగలుగుతారు. మీ నిర్ణయానికి కుటుంబ సభ్యులు అండగా ఉంటారు. 
సింహం
వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. మిత్రులను కలుస్తారు. ఈరోజు మంచి రోజు అవుతుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగుతాయి. దూరపు ప్రయాణాలు చేయొద్దు. 
కన్య
ఈరోజంతా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగస్తులకు టెన్షన్ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. చాలా కాలం తర్వాత బంధువులు లేదా స్నేహితుడితో సమావేశం అవుతారు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులు మరింత శ్రమించాలి.   వృత్తిలో పురోగతి ఉంటుంది.  అప్పులు ఇవ్వొద్దు. సోదరుల సహకారంతో కొత్త ప్రణాళికలు వేసుకోవచ్చు.
Also Read: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
తుల
కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు.  ఏదైనా పని విషయంలో పెద్దల సలహా తీసుకోండి.  మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులు కార్యాలయంలో కొత్త సమాచారాన్ని పొందుతారు. రహస్య చర్చలు జరుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. పొదుపు చేసే ఆలోచన చేయండి. 
వృశ్చికం
ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.  అనవసర ఖర్చులను అదుపుచేయండి.  కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరికీ సలహా ఇవ్వకండి. గతంలో చేసిన కష్టానికి తగిన ఫలాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఎవరితోనైనా విభేదాలు రావచ్చు. పనిలో పురోగతి ఉంటుంది.
ధనుస్సు
ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. కుటుంబంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఏదో ఒక వివాదం రావచ్చు. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మునుపటిలానే ఉంటుంది. పనిలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 
Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
మకరం
ఈరోజు అదృష్టం కలిసొస్తుంది. మీ వ్యాపారం మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. సామాజిక స్థితి బలంగా ఉంటుంది. మీకు మంచి సమాచారం అందుతుంది.  యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కార్యాలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
కుంభం
ఎప్పటినుంచో చేతికందాల్సిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. రోజంతా సరదాగా గడుపుతారు. కార్యాలయంలో సహోద్యోగి సహాయం పొందుతారు. మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. సోమరితనం ఉంటుంది.  ఆలోచించి మాట్లాడండి. ప్రస్తుతానికి కొత్తగా ఏపనీ ప్రారంభించవద్దు.  ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. 
మీనం
ఈరోజు మంచి రోజు అవుతుంది. కుటుంబ పనుల కారణంగా ఇతర నగరాలకు వెళ్లవచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.పెట్టుబడి పెట్టే ఆఫర్లు పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. సామాజిక జీవితం బాగుంటుంది. బయట ఏదైనా తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైన వ్యవహారాలు సాగుతాయి. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసర మాటలు వద్దు.
Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి