మార్చి 16 బుధవారం రాశిఫలాలు

మేషంతలపెట్టన పనుల విషయంలో కొన్ని సందేహాలుంటాయి. కుటుంబ పనుల్లో చిక్కుకుపోతారు. శుభ కార్యాల కోసం ధనం వచ్చిస్తారు.  మీ నిర్ణయాన్ని తరచుగా మార్చుకోకండి. సంతానం విజయం సాధిస్తుంది.

వృషభంఏదో ఒక విషయంలో వాగ్వాదం ఉండొచ్చు. మీ ఆలోచనలను ఉన్నతంగా ఉంచండి. ప్రణాళికాబద్ధంగా పని చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల మధ్య వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మిథునంవిద్యారంగంలో పోటీ వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. సంప్రదాయవాద అభిప్రాయాలను మార్చుకోండి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.

Also Read: శివుడు ఖండించిన వినాయకుడి తల ఇప్పటికీ అక్కడుంది

కర్కాటకంఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మాట్లాడేటప్పుడు పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు.  పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించండి.

సింహం మంచి వ్యక్తులు పరిచయమవుతారు.  మీ పనితీరు మారుతుంది. మీరు కుటుంబానికి సంబంధించి కొన్ని ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. 

కన్యపనికిరాని పనులకు దూరంగా ఉండండి. ఉదర సంబంధిత రుగ్మతలతో బాధపడతారు. చెడు సాంగత్యం వల్ల మీరు బాధపడతారు. సహోద్యోగులతో వివాదాలు వద్దు. 

తులకొన్ని విచారకరమైన వార్తలు విన్న తర్వాత మీరు భావోద్వేగానికి లోనవుతారు. మీ సమర్థత పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

వృశ్చికం మీరు చాలా చురుకుగా ఉంటారు. కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన విషయంపై చర్చిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ రోజు చాలా మంచిది. మీ మనసులో కొత్త సృజనాత్మక ఆలోచనలు పుడతాయి. తెలియని అడ్డంకి ద్వారా ప్రభావితమవుతుంది.

Also Read:శనివారం సాయంత్రం ఈ చెట్టుకింద దీపం వెలిగిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి

ధనుస్సుమీరు శారీరక బలహీనతతో బాధపడతారు. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులపై కోపం ప్రదర్శించకండి. ప్రేమ సంబంధాల్లో పరస్పర విశ్వాసం లోపిస్తుంది. విహారయాత్రకు వెళ్తారు

మకరంఈ రోజంతా అసంతృప్తిగా ఉంటుంది. కార్యాలయంలో ఆటంకాలు ఉంటాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందడం కష్టమవుతుంది. మీ తప్పులను అంగీకరించండి. ఒత్తిడికి లోనవుతారు.

కుంభం ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు భాగస్వామ్యంతో చేసిన వ్యాపారం నుంచి ప్రయోజనం పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు.

మీనంఎవరినీ వ్యతిరేకించొద్దు. వృత్తికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలనే ఒత్తిడి పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అర్ధంలేని చర్చలో సమయం వృధా చేసుకుంటారు.