5 మార్చి 2022 శనివారం రాశిఫలితాలు
మేషం
కార్యాలయంలో తప్పులు పదే పదే పునరావృతం చేయవద్దు. కోపం మీ పనితీరుపై ప్రభావం పడుతుంది. బంధువులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. జీవిత భాగస్వామి మాట వినండి. ప్రయాణంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
వృషభం
కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. టైం చూసుకునేంత టైమ్ లేనంత బిజీగా ఉంటారు. వినోద సాధనాల కోసం ఖర్చు చేస్తారు. ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది. ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ప్రేమికులు ఈ రోజును ఆనందిస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు.
మిథునం
ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ పూర్తవుతాయి. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. డిపాజిట్ మూలధనాన్ని పాలసీలో పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేసుకోండి. గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ సామర్థ్యంతో ప్రశంసలందుకుంటారు. కొన్ని శుభ కార్యాలకు సంబంధించి మనసులో సందేహాలు తలెత్తవచ్చు.
కర్కాటకం
కొత్త వ్యక్తులతో వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా తలపెట్టిన పనుల వల్ల ప్రయోజనం ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. మీ కుటుంబ సభ్యులతో ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి చర్చిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనానికి వెళ్తారు. మీకు ఈ రోజంతా మంచిదే.
సింహం
ఒకరి తప్పుడు సలహాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టం వస్తుంది. తప్పులను పునరావృతం చేయవద్దు. చెడు అలవాట్లను విడిచిపెట్టేందుకు ప్రయత్నించండి. మీ సహోద్యోగులతో మంచిగా వ్యవహరించండి.
Also Read: ఈమె 'మగధీర' మిత్రవింద కాదు శ్రీకృష్ణుడి మిత్రవింద
కన్య
కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. ప్రేమ వివాహాల గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి. మీరు స్నేహితులతో సంతోష సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో కలసి షికారు చేయడానికి మంచి రోజు. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి.
తుల
ఈరోజు సాధారణంగా ఉంటుంది. స్నేహితునితో విభేదాలు రావచ్చు. అవసరమైనవారికి మాత్రమే మీరు సలహాలు ఇవ్వండి. కొన్ని పనుల్లో ప్రయోజనం ఉంటుంది. అనవసర ఖర్చుల వల్ల బడ్జెట్‌కు ఆటంకం కలుగుతుంది.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి.
వృశ్చికం
ఈ రోజు మీకు చాలా సంతోషకరమైన రోజు. టెన్షన్ తగ్గుతుంది. సహోద్యోగులను కలుస్తారు. పూజల పట్ల ఆసక్తి ఉంటుంది. యువత కెరీర్ పరంగా విజయం సాధిస్తారు. వ్యాపారంలో సాంకేతిక దోషం తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టండి.
ధనుస్సు
తెలియని వ్యక్తులతో ఎలాంటి వ్యవహారాలు పెట్టుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. ఆధ్యాత్మికం, కర్మ సిద్ధాంతం పై ఆసక్తి ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. వ్యాపార ప్రణాళికల్లో విజయం ఉంటుంది. ఎలాంటి బాధల నుంచైనా ఉపశమనం పొందుతారు.
Also Read: పురుషులు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే దాంపత్య సమస్యలు తప్పవట
మకరం
ఈ రోజంతా బిజీ బిజీగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. కుటుంబ కార్యక్రమాల కోసం సెలవు తీసుకుంటారు. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందే అవకాశం ఉంది. అధికారితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఏ పనిలోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మీరు అసంతృప్తికి లోనవుతారు.
కుంభం
బంధువులతో వివాదాలుంటాయి. పనికిరాని పనులతో సమయాన్ని వృథా చేయడం మానుకోండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆధ్యాత్మికత పట్ల మక్కువ ఉంటుంది. మీరు ఈరోజు మేధావులతో చర్చిస్తారు.
మీనం
ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి ప్రమోషన్ కు సంబంధించిన సమాచారం అందుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రేమికులకు ఈరోజు అద్భుతమైన రోజు అవుతుంది. టెన్షన్ తగ్గుతుంది. ఎవరికీ సలహా ఇవ్వకండి. మీ సంపద పెరుగుతుంది. తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించండి.మీ జీవిత భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది.