ఫిబ్రవరి 1 మంగళవారం రాశిఫలాలు


మేషం 
ఈ రోజు మీరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు.  వ్యాపారంలో కలిసి పనిచేసే వారికి మీపై నమ్మకం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. నిలిచిపోయిన పనిని పూర్తి చేయగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


వృషభం 
మీరు కొంచెం చికాకుగా ఉండొచ్చు. వివాదాలకు, అనవసర చర్చలకు దూరంగా ఉండండి. మీరు మీ నైపుణ్యంతో పనిని పూర్తి చేస్తారు. మానసిక స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులపై ఒత్తిడి ఉంటుంది.


మిథునం 
ఆరోగ్యానికి సంబంధించి సమస్యలుంటాయి.  మీరు బలహీనతను అధిగమిస్తారు. ప్రయాణంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటం వల్ల కాస్త ఆందోళన చెందుతారు. రోజు ప్రారంభంలో, మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.


కర్కాటకం
ఈ రోజు మీరు మీ పెండింగ్‌లో ఉన్న పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. నిలిచిపోయిన మొత్తాన్ని తిరిగి పొందడం ద్వారా మీ డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. యువతకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇతరులు మీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు.


Also Read:  రామానుజాచార్యుల దివ్యశరీరం ఇంకా భద్రపరిచే ఉంది... మీరు చూశారా...
సింహం
ఏదైనా పనిని వాయిదా వేసే ధోరణి మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని నమ్మిన వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. ఈ రోజు, మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు, నిరాశ పెరుగుతుంది. గ్యాస్ సమస్యతో బాధపడతారు.  మీ ఆలోచనలను నియంత్రించుకోండి. 


కన్య 
ఏదైనా పని పూర్తి చేయడంలో ముందు వెనక తటపటాయిస్తారు. ఈరోజంతా ఏదో అసౌకర్యంగా భావిస్తారు. కార్యాలయంలో ఎవరితోనైనా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు ఉద్యోగంలో వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి.


తుల  
ఈ రోజంతా బద్ధకంగా ఫీలవుతారు. రావాల్సిన శుభవార్త కోసం వెయిట్ చేస్తారు. సంతోష సాధనాల కోసం ఖర్చు చేస్తారు. మీరు మీ నైపుణ్యంతో మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అనారోగ్య సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 


వృశ్చికం
కొన్ని సమస్యల కారణంగా కుటుంబంలో వివాదాలు ఏర్పడవచ్చు. స్నేహితులతో కలిసి సరదాగా ఉంటారు. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించవచ్చు. ఉద్యోగులు పురోగతి సాధిస్తారు. వైవాహిక బంధం మాధుర్యంగా ఉంటుంది. 


Also Read: ముచ్చింతల్‌ లో రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల షెడ్యూల్ ఇదే..
ధనుస్సు
అసమతుల్యత కారణంగా మీ డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది.  చిరాకుగా ఉంటారు.  మాటల నియంత్రణ వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. తప్పుడు నిర్ణయం వల్ల మీరు తలపెట్టిన పని పూర్తికాదు. మానసిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.


మకరం 
 కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వేరేవారి మాటల్లో మధ్యలోకి వెళ్లి అనవసర కోపాన్ని ప్రదర్శించకండి. బ్యాంకింగ్ కి సంబంధించిన పనులు పూర్తిచేయగలుగుతారు. 


కుంభం 
మారుతున్న వాతావరణం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈరోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది. పంటి నొప్పితో బాధపడే అవకాశం ఉంది. ఒకరి మాటలు బాధిస్తాయి. కుటుంబ కలహాలు ఉంటాయి. మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోవడం మానుకోండి. యువత కష్టపడి పనిచేయాలి. ప్రత్యర్థులనుంచి జాగ్రత్తగా ఉండాలి. 


మీనం
గృహ నిర్మాణం, కొనుగోలు, అమ్మకంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగంలో పెద్ద బాధ్యతను సులభంగా నిర్వర్తిస్తారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. ఎవరినైనా ఆకర్షించవచ్చు. అధికారులతో సఖ్యత ఉంటుంది. కొన్ని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


Also Read: శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో కొలువుతీరనున్న శ్రీరామానుజాచార్యుల విగ్రహం ప్రత్యేకతలివే…