2022 జనవరి 27 గురువారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీకు సాధారణ ఫలితాలున్నాయి. కార్యాలయంలో మీ విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు, అధికారులతో వాగ్వాదం ఉండొచ్చు. ఏ పనీ పూర్తిచేయలేరు. మీరు పొట్టకి సంబంధించిన వ్యాధితో బాధపడొచ్చు. కొత్తగా పరిచయమైనవారిని వెంటనే నమ్మొద్దు. తల్లిదండ్రులతో సమయం గడపండి.
వృషభం
మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పితృ సంబంధ విషయాల్లో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు కార్యాలయంలో కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవచ్చు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మీ వ్యూహాలు, నైపుణ్యంతో కష్టాలు అధిగమిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ రావొచ్చు.
మిథునం
ఈరోజు బద్ధకంగా ఉంటారు. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. స్నేహితుల సహాయంతో మీ పనులు పూర్తిచేస్తారు. ముఖంలో సంతృప్తి కనిపిస్తుంది. మీ సహోద్యోగుల నుంచి విమర్శలు ఎదుర్కోవచ్చు. వాహనం జాగ్రత్తగా నడపండి.
Also Read: యజ్ఞయాగాదులు దేవుడికోసం అనుకుంటే మీరు పొరబడినట్టే...
కర్కాటకం
ఈరోజు మీరు పిల్లల గురించి ఆందోళన చెందుతారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. ప్రేమికులకు ఈరోజు శుభదినం కాదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి ప్రతిపాదనలు పొందుతారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుడితో సమావేశంలో మీరు కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చించవచ్చు.
సింహం
ఆస్తికి సంబంధించిన వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ వనరులు పరిమితంగా ఉంటాయి. ఈ రోజంతా గందరగోళంలో గడుపుతారు. నిండు మనసుతో ఒక పనిని పూర్తి చేస్తారు. కొంత రహస్య సమాచారం తెలుసుకుంటారు.
కన్య
పొదుపు చేయడంపై శ్రద్ధ చూపుతారు. డబ్బు భద్రత విషయంలో అలర్ట్ ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పాత పనులను పూర్తి చేయడంతో మీరు సంతృప్తి చెందుతారు. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోండి.
Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
తుల
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యక్తులు కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ మాటతీరుతో ఆకట్టుకుంటారు. మీ పనులు కొన్ని రోజు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
వృశ్చికం
వ్యాపారులకు కలిసొచ్చే రోజు. ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకోవడం ద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. గౌరవనీయమైన వ్యక్తితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఉద్యోగులు తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి.
ధనుస్సు
ఈ రోజు మీకు చాలా సంతోషకరమైన రోజు. కొన్ని విషయాల్లో మీ కుటుంబ సభ్యులను అనుమానించకండి. ఏదైనా ముఖ్యమైన పని గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి. కొన్ని పనుల్లో ఆటంకాలు రావడంతో కోపం పెరుగుతుంది. ప్రత్యర్థులు గొడవ చేయవచ్చు. ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయడానికి ప్రయత్నించండి.
Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఈ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!
మకరం
మీ పని తీరు మెరుగుపడుతుంది. గతంలో ఆగిపోయిన మొత్తాన్ని తిరిగి పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. మీతో పని చేయడం చాలా మందికి గర్వకారణం. మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు మంచి రోజు కాదు. వ్యాపారంలో లాభం సాధిస్తారు. కొత్త పని మీకు లాభాన్నిస్తుంది.
కుంభం
అనవసర విషయాలపై ఎక్కువగా చర్చించకండి. అనవసర ఆలోచనలు నియంత్రించుకోండి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక పనిని పూర్తి చేయలేకపోవడం మిమ్మల్ని బాధపెడుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు.
మీనం
ఆఫీసులో మీ బాధ్యతలు ఈ రోజు సక్రమంగా నెరవేర్చలేరు. తలపెట్టిన పనుల్లో వ్యతిరేక ఫలితాలను పొందడం ద్వారా మీరు నిరాశ చెందుతారు. మీ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. భగవంతుని ఆరాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పై అధికారులతో ఎక్కువగా వాదించకండి.
Also Read: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి