అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం,  సర్పయాగం, విశ్వజిత్ యాగం..ఇలా పురాణకాలం నుంచి రకరకాల యజ్ఞాలు చేశారనే వినిఉంటారు, చదివి ఉంటారు. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. అంటే  వారిని మెప్పించడమే. యజ్ఞంలో అగ్నిలో వేసినవన్నీ దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. ఇతిహాసాల్లో కర్దమ ప్రజాపతి కుమారుడు ఇలుడు అశ్వమేధం నిర్వహించి పురుషత్వాన్ని తిరిగి పొందాడు. శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు పట్టాభిషిక్తుడై అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. మహాభారతంలో జనమేజయుడు సర్పయాగం నిర్వహించాడు.


Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
యజ్ఞాలు ఆరు రకాలు


ద్రవ్యయజ్ఞం: ద్రవ్యాన్ని న్యాయంగా, ధర్మంగా ఆర్జించాలి. ఆర్జించిన ధనం ధర్మకార్యాలకు వెచ్చించాలని చేసే యజ్ఞం.


 తాపయజ్ఞం: జ్ఞానాగ్నితో ఆత్మను తపింపచేసి, పునీతం, తేజోవంతం చేయడమే పవిత్రమైన తాపయజ్ఞం.


 స్వాధ్యాయయజ్ఞం: ఏ విద్యనైనా సరే, కేవలం అధ్యయనం చేయటమే కాదు, అర్థం చేసుకుని లోకకల్యాణానికి వినియోగించడమే స్వాధ్యాయయజ్ఞం.


 యోగయజ్ఞం: యమ, నియమాదులతో మనస్సుపై పట్టు సాధించి, మానసిక శక్తి సంపాదించటమే యోగయజ్ఞం.


 జ్ఞానయజ్ఞం: మనిషి తానెవరు? ఎందుకు పుట్టాడు? ఏం చేయాలని ఆలోచించి, తపించి ఆత్మదర్శనానుభవం పొందాలి. అదే జ్ఞానయజ్ఞం.


 సంశితయజ్ఞం: తనలో కామక్రోధమద మాత్సర్యాలను జయించి, నియమబద్ధంగా కర్మాచరణ చేయడమే సంశితయజ్ఞం.


పాక యజ్ఞాలు,హవిర్యాగాలు, సోమ సంస్థలు..ఇవి కూడా యజ్ఞాల్లో మరో మూడు రకాలని చెబుతారు. 


Also Read:  ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఈ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!
యజ్ఞం ఎందుకు చేయాలి


యజ్ఞం చేసేటప్పుడు నెయ్యి, పాలు, ధాన్యం, ఆవు పేడ పిడకలు, జిల్లేడు, మొదుగ, దర్బలు, గరిక , ఆరోగ్యాన్ని ఇచ్చే పలు వృక్షాల కట్టెలు వేస్తారు. ఇవన్నీ దేవుడి కోసం మాత్రమే కాదు....



  • యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగ వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి గాలిలో స్వచ్ఛతని పెంచుతాయి.  దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు రావు.

  • యజ్ఞ కర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలు, చుట్టుపక్కల వారుకూడా ఆరోగ్యంగా ఉంటారు.

  • పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్ష్యాదులు బాగుంటాయి.

  • అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే మన పురాణాలు, ఇతిహాసాల్లో హోమాలు, యజ్ఞాల ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది.

  • హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయొచ్చు.

  • యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది.

  • ఈ పొగని మనం పీల్చడం వల్ల అనారోగ్యాలు నయమవుతాయి.


Also Read: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…


ఇటీవల కాలంలో యజ్ఞం చేసేవారని చూసి అపహాస్యం చేసేవారి సంఖ్య పెరిగింది. ఇదేమైనా పురాణ కాలమా, రాజుల కాలమా యజ్ఞయాగాదులు చేస్తే వానలు పడతాయా, పంటలు పండతాయా, అంటువ్యాధులు పోతాయా అంటున్నారు. కానీ మనం చేసే యజ్ఞం దేవుడికోసం కాదు, మనకోసం అన్నది గుర్తించాలంటారు వేదపండితులు. గాలి కూడా కొనుక్కుంటున్న ఈ రోజుల్లో వాతావరణంలో పేరుకుపోతున్న కాలుష్యాన్ని కొంచెమైనా నియంత్రించి గాలిని ఫిల్టర్ చేసుకోవడం ఎంతో అవసరం అంటారు. అంటే పేరు దేవుడిది, ఫలితం మనదన్నమాట. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి